తెలంగాణ

తోబుట్టువు ఇంటికి వచ్చినట్టు ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ‘ఉమా మాధవరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడం ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టు ఉంది. ఆమె నాకు తోబుట్టువులాంటిది, పార్టీలో చేరేందుకు ఎలాంటి డిమాండ్ పెట్టలేదు, మనసున్న మంచి వ్యక్తి. ఉమాకు ఆమె కుమారుడు సందీప్‌రెడ్డికి భవిష్యత్‌లో ఉన్నత అవకాశాలు ఉంటాయి’ అని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. టిడిపికి రాజీనామా చేసిన ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి గురువారం తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పార్టీలోకి వచ్చే వారు సాధారణంగా ఎమ్మెల్యే టికెట్ కోరుతారు, కానీ ఉమా మాధవరెడ్డి ఎలాంటి డిమాండ్లు పెట్టకుండానే టిఆర్‌ఎస్‌లోకి రావడం ఆమె మంచితనానికి నిదర్శనమన్నారు.
తనకు దగ్గరివారు అయినప్పటికీ ఇంతకాలం వారు పార్టీకి దూరంగా ఉండటంతో బాధపడ్డానన్నారు. రాజకీయాల్లో ఎవరికీ ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పలేమన్నారు. ఈ రోజుల్లో రాజకీయాల్లోకి ఇలా రాగానే అలా పదవులు రావాలని అనుకుంటారన్నారు. పార్టీలో చేరడానికి ముందే తానేమి టికెట్ ఆశించి పార్టీలో చేరడం లేదని, ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి ఏ విధంగా పోటీ కాదనే విషయం చెప్పాలని కోరిన పెద్ద మనసు ఉమా మాధవరెడ్డిదని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉమా మాధవరెడ్డి, సందీప్‌రెడ్డికి మంచి భవిష్యత్ కల్పిస్తామని, ఉన్నత అవకాశాలు ఉంటాయన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సర్వసాధారణమని, పార్టీలో పాత, కొత్త నేతలంతా కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
తెలంగాణకు వివక్షపై కొట్లాడేవాళ్లం
దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి, తాను ఒకేసారి 1985లో టిడిపి నుంచి ఎమ్మెల్యేం అయ్యామని గత జ్ఞాపకాలను ముఖ్యమంత్రి గుర్తు చేసారు. మాధవరెడ్డి తనకు ఆత్మీయ మిత్రుడన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో తెలంగాణ ప్రాంతానికి నిధుల కేటాయింపులో జరిగిన వివక్షపై తామిద్దరమూ కొట్లాడేవాళ్లమన్నారు. విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు తామిద్దరం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు తెలిపారు. వచ్చే ఏడాదికల్లా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి భువనగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నామని, అలాగే ఇదే ప్రాంతంలోని యాదాద్రి తెలంగాణలోనే గొప్ప పుణ్యక్షేత్రమని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి టిఆర్‌ఎస్‌లో చేరుతున్న కొత్తవారితో పాత వారు కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
చిత్రం..గురువారం తెలంగాణభవన్‌లో టీడీపీ నాయకురాలు ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డిలకు కండువాలు కప్పి తెరాసలోకి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్