తెలంగాణ

మూడు జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 938.47 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణలో మూడు ప్రధాన జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 938.47 కోట్ల నిధులకు ప్రతిపాదనలను ఆమోదించినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పై ఆరాంగడ్ నుంచి శంషాబాద్ వరకు ఆరు వరుసల 9.90 కి.మీ దూరం అభివృద్ధికి రూ.263.44 కోట్లు, హైదరాబాద్-నర్సాపూర్-మెదక్ జాతీయ రహదారి వరకు నాలుగు వరుసల అభివృద్ధికి రూ.430.05 కోట్లు, హైదరాబాద్-వరంగల్-్భపాలపట్నం జాతీయ రహదారిపై వరంగల్-ములుగు వరకు రెండు వరుసలు 35.40 కి.మీ అభివృద్ధికి రూ.244.98 కోట్ల ప్రతిపాదనలు ఆమోదించినట్లుచెప్పారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టరేట్ల నినర్మాణం వాటి నమూనాలు పరిశీలించిన మంత్రి తుమ్మల మొత్తం 26 నూతన జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలకు భూసేకరణ ఇంకా జరగక రంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాల నుంచి పనులు ప్రారంభం కాలేదని మంత్రి చెప్పారు.