తెలంగాణ

తెలుగు భాష సొగసు మరే భాషకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలుగు భాష సొగసు మరే భాషకు లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. అవధానం అనే ప్రక్రియ మరే భాషలో లేదని, అదే తెలుగుకు ఉన్న అద్భుతమని కొనియాడారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతి సమావేశ మందిరం గుమ్మన్న గారి లక్ష్మీనర్సింహ శర్మ ప్రాంగణం, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై డాక్టర్ మలుగ అంజయ్య అష్టావధాన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష సొగసు దాని నిర్మాణ వ్యాకరణ ఉచ్ఛారణ, వివిధ ప్రక్రియల్లో ఉంటుందని అన్నారు. ప్రజలు మాట్లాడే భాషకు అంతం లేదని అన్నారు. కొన్ని భాషా ప్రక్రియలు ఆ భాష గొప్పదనానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.
అవధాన ప్రక్రియ అలాంటి వాటిలో ఒకటని తెలిపారు. అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం వరకు మన భాష అవధాన ప్రక్రియలు వెళ్లాయని అన్నారు. ఒకేసారి అనేక మంది పృచ్ఛకులు అనేకంగా వేసే ప్రశ్నలకు ఎలాంటి జంకు లేకుండా వారడిగిన పద్దతుల్లోనే అలవోకగా, అనర్గళంగా సమాధానమివ్వడమనేది మేథతో పెట్టిన విద్య అన్నారు. ఇందులోనూ అప్రస్తుత ప్రసంగి తరచూ అడ్డుపడుతూ వేసే ప్రశ్నలకు జవాబిస్తూనే అవధానం కొనసాగించడం ఒక్క తెలుగు భాషలోనే ఉందని అన్నారు. ఇలాంటి అనేక ప్రక్రియలు ఉన్న తెలుగు భాష మన మాతృ భాష కావడం మన పూర్వ జన్మ సుకృతమని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు పాల్గొనేందుకు అవకాశం కలిగించారని అన్నారు. ఈ మహాసభలు విజయవంతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అవధానికి జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ అష్టావధానంలో మూటకోడూరు బ్రహ్మం, డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, రాపాక ఏకాంబరాచారి, చిక్కా రామదాసు తదితరులు పాల్గొన్నారు.