తెలంగాణ

పుస్తక ప్రదర్శనకు మంచి ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన సాహితీ ప్రియులు, పుస్తక పఠనాసక్తి ఉన్న వారిని ఆకట్టుకుందని హైదరాబాద్ బుక్ ఫేర్ కమిటీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ప్రదర్శనకు హాజరవుతున్న ప్రజలను గమనిస్తే పుస్తకాలకు ఆదరణ తగ్గుతుందన్న మాటల్లో నిజం లేదని, వేల సంఖ్యలో పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
మహాసభల సందర్భంగా ఎల్‌బి స్టేడియంలోని సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుస్తక ప్రదర్శనలో 55 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వీటిలో తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, కథలు, వారి జీవితాలు, నవలలు, ప్రపంచ దేశాల వివరాలు పురాణగాధలు, భారత రామాయణం, భాగవతం, నాలుగు వేదాలు, పెద్ద బాల శిక్ష, భగవద్గీత, పోటీ పరీక్షల పుస్తకాలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు విషయాలను తెలియజేసే పుస్తకాలను ఈ పుస్తక ప్రదర్శనలో ఉంచినట్లు వివరించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కార్యదర్శి చంద్రమోహన్, బ్రహ్మం, ప్రిన్సిపల్ సంఘం కార్యదర్శి రామదాసు తదితరులు పాల్గొన్నారు.