తెలంగాణ

తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులదే కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. శనివారం ఇక్కడ ప్రగతిభవన్‌లో మంత్రి కెటిఆర్, మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫోటోగ్రాఫర్లకు కెమెరాలను అందచేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మిలియన్ మార్చ్, సాగరహారం సందర్భంగా జర్నలిస్టులపై దాడులు జరిగాయి. అలాగే ఓయూలో కూడా పోలీసులు మీడియాపై దాడి చేసి కెమెరాలను, మోటార్ సైకిళ్లను ధ్వంసం చేశారు. పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ నమోదైన కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది జర్నలిస్టులకు, ఫొటోగ్రాఫర్లకు కెమెరాలను, మోటారు సైకిళ్లను ఇప్పించారు. చివరగా తొమ్మిది మంది ఫోటోగ్రాఫర్లకు ఒక్కొక్కరి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల విలువ ఉన్న నికాన్ కెమెరాలను కెటిఆర్ చేతుల మీదుగా ఇచ్చారు.

చిత్రం..శనివారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా కెమెరాలు అందుకున్న ఫొటో జర్నలిస్టులు