తెలంగాణ

శ్రీశ్రీ కంటే ముందే తెలంగాణలో వచనా వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: మహాకవి శ్రీశ్రీ కంటే ముందే తెలంగాణ ప్రాంతంలో వచన కవితా వికాసం జరిగిందని డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు యూనివర్శిటీ, బిరుదురాజు రామరాజు ప్రాంగణం సామల సదాశివ వేదికపై తెలంగాణ వచన కవితా వికాసం అనే అంశంపై శనివారం నాడు జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బిసి కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కె శివారెడ్డి, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, డాక్టర్ మాదిరాజు రంగారావులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వచన కవిత్వం వస్తువైవిధ్యంపై డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వచన కవితా శిల్పంపై పెన్నా శివరామకృష్ణ, ఆధునిక వచన కవితా సామాజికత అనే అంశంపై సీతారాం, వచన కవిత్వంపై డాక్టర్ అఫ్సర్ మాట్లాడారు. కార్యక్రమానికి పొట్లపల్లి శ్రీనివాసరావు సమావేశకర్తగా వ్యవహరించగా, రాపోలు సుదర్శన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ 1935లోనే సురవరం ప్రతాప్‌రెడ్డి కవిత్వం రాశారని అన్నారు. ఆ తర్వాతనే శ్రీశ్రీ వచన కవిత్వం అందుబాటులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు శివారెడ్డి మాట్లాడుతూ తొలి వచన కవి శ్రీశ్రీ మాత్రమేనని అన్నారు. మనిషి బతికి ఉన్నంత కాలం వచన కవిత నిలిచి ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక రూపం ఉన్నట్టే సాహిత్యంలో కూడా అనేక రూపాలుంటాయని, వచన కవిత పరిణామానికి ముందు ఎంతో విస్తృతిని, విశాలత్వాన్ని పొందిందని చెప్పారు. ఇంతటి లోతు- విస్తృతి- గాఢత ఇంకే ప్రక్రియలోనూ రాలేదని అన్నారు. కవిత్వానికి తక్షణం ఆవిర్భవించే గుణం ఉంటుందని, మిగిలిన రూపాలకు సమయం పడుతుందని శివారెడ్డి వివరించారు. వచనం పెట్టుబడిదారుల ప్రక్రియ అనేది కేవలం అపవాదు మాత్రమేనని, వచన కవిత్వానికి ప్రత్యేక రూపం, శిల్పం అనేవి ఆయా కవుల సామర్ధ్యం, వస్తువుల ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు. కవిత్వం అనేది అలవోకగా రాసేది కాదని, ఏ మార్గం లేక రచనలు చేసేందుకు ఎవరూ ముందుకు రావద్దని హితవు పలికారు. సాధన- విస్తృత అధ్యయనం అనేవి చాలా ముఖ్యమని చెప్పారు. సుంకిరెడ్డి మాట్లాడుతూ 1970 తర్వాత విప్లవోద్యమం అనంతరం మాత్రమే తెలంగాణలో వచన కవిత్వం వచ్చిందనేది సరికాదని ఆధారాలతో సహా వివరించారు. పెన్నా శివరామకృష్ణ వచన కవితా శిల్పం గురించి వివరించగా, డాక్టర్ అఫ్సర్ వచన కవిత్వ రీతులను వివరించారు. ఆధునిక వచన కవితలో సామాజికతపై సీతారాం మాట్లాడారు.

చిత్రం..ప్రపంచ మహా సభల వేదికపై ప్రసంగిస్తున్న అమెరికా ప్రొఫెసర్ అఫ్సర్