తెలంగాణ

లిఫ్ట్ వైర్లు తెగి ఇద్దరు టెక్నీషియన్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 16: లిప్ట్ మరమత్తులు చేస్తుండగా ప్రమాదవ శాత్తు చైన్ లింక్ తెగిపోవడంతో క్రిందపడి ఇద్దరు లిఫ్ట్ టెక్నీషయన్స్ మృతి చేందిన సంఘలన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్‌సీసీ కార్పొరేట్ కార్యలయంలో జరిగింది. పోలీసులు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చేందిన ఆగు మందుల రమేష్ (23), ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జెక్కేపల్లి గ్రామానికి చేందిన గూడూరు నాగరాజు(28), జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలో లిఫ్ట్ టెక్నీషయన్స్‌గా పని చేస్తున్నారు. శనివారం కార్యలయానికి సెలవుకావడంతో లిఫ్ట్ ఇబ్బంది పెడుతుండడంతో మరమత్తులు చేయాలని ఎన్‌సీసీ అధికారులు కోరారు. ఉదయం మరమత్తు చేయాడాకి రమేష్, నాగరాజులు వచ్చారు. మధ్యాహ్నం 11వ అంతస్తులో మరమత్తులు చేస్తుండగా ప్రమాదవ శాత్తు లిఫ్ట్ చైన్ లింక్ తెగిపొవడంతో ఇద్దరు క్రింద పడిడడంతో తీవ్రగాలై సంఘటన ప్రదేశంలోనే మృతి చేందారు. విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని శవాలకు పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భద్రత చర్యలు తీసుకోకపోవడం వలన ఇద్దరు మృతి చేందినట్లు భాదిత కుంటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని భద్రత లోపం ఉంటే సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామాని మాదాపూర్ సీఐ కళింగరావు తెలిపారు.

చిత్రం..సంఘటన ప్రదేశంలోని లిఫ్ట్‌లో పడి ఉన్న మృతదేహలు