తెలంగాణ

సభలపై చూపిన శ్రద్ధ వర్శిటీలపై చూపితే బాగుండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: హైదరాబాద్ ప్రపంచ మహాసభలు నిర్వహించడంపై చూపించిన శ్రద్ధలో కనీసం పదో వంతు శ్రద్ధ చూపించినా బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు మేలు జరిగేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రపంచ మహాసభలకు తాము వ్యతిరేకం కాదని, అంతటి శ్రద్ధను సిఎం యూనివర్శిటీలపైనా చూపించాలని పేర్కొన్నారు. తెలుగు యూనివర్శిటీకి 2003లో బాచుపల్లిలో వంద ఎకరాల్లో శంకుస్థాపన చేశారని, 2005లో 50 గదులతో ఒక హాస్టల్, లైబ్రరీతో పాటు పరిపాలనాభవనాన్ని కూడా పూర్తి చేశారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ బిడ్డలు నానా ఇబ్బందులూ పడుతున్నారని అన్నారు. గతంలో వంద మంది విద్యార్థులు ఉండేవారని, కాని నేడు 30 మంది విద్యార్థులకే పరిమితం అయిందని చెప్పారు. అక్కడి నుండి లైబ్రరి కోసం ఒయు క్యాంపస్‌కు, క్లాసుల కోసం నాంపల్లి విద్యార్థులు రావల్సి వస్తోందని పేర్కొన్నారు. విషపూరిత పాములు తిరుగుతున్నాయని, కేర్ టేకర్ అందుబాటులో లేరని చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయిల విలువైన భూమిలో విశ్వవిద్యాలయ నిర్మాణం చేపడితే దానిని సద్వినియోగం చేయకపోవడం దారుణమని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్లు కావస్తున్నా ఈ విషయం పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు.