తెలంగాణ

కరువు ప్రాంతాల్లో పశుగ్రాసం శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్రంలో వర్షాభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల వల్ల అవసరమైన చోట పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పాడి, మత్స్య, పశుసంవర్ధకశాఖల మంత్రిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధిత శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే మహబూబ్‌నగర్, నారాయణఖేడ్ పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు మరెక్కడైనా పశుగ్రాస కేంద్రాలు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపించాల్సిందిగా అధికారులను ఆయన అదేశించారు. దేశంలోనే పాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో, మాంస ఉత్పత్తిలో 5వ స్థానంలో, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లకు ప్రస్తుతం కల్పించిన వైద్య సౌకర్యాలను మెరుగు పర్చాలని మంత్రి ఆదేశించారు.
అలాగే రాష్టవ్య్రాప్తంగా 100 సంచార వెటర్నరీ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. గొర్ల్రె పెంపకానికి జాతీయ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ. 398 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. వీటి పెంపకానికి ముందుకు వచ్చే వారికి రుణంలో 20 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్టు మంత్రి తలసాని వివరించారు.