తెలంగాణ

మద్దతివ్వడమే కాదు ప్రచారమూ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: ‘పాలేరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల్లో మాకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు సంతోషం...అలాగే ప్రచారమూ చేయండి..’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ అధినేతలను కోరనున్నది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలని టి.కాంగ్రెస్ ప్రయత్నించి కొంత వరకు సఫలీకృతమైంది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచన మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు సహకరించాల్సిందిగా కోరారు. అందుకు వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణనూ ఇదే విధంగా కోరగా, ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి పోటీ నుంచి తప్పుకున్నారు.అయితే పోటీ నుంచి తప్పుకున్నారే తప్ప కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించకపోవడం విశేషం. బిజెపిని కాంగ్రెస్ కోరకపోయినా వివిధ కారణాలతో తాము పోటీ చేయడం లేదని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ గురువారం ప్రకటించారు. సిపిఎంనూ కోరగా అందుకు ఆ పార్టీ నిరాకరించింది. సిపిఐ ఆ పార్టీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితా రెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. వెంకట్‌రెడ్డి సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఇలాఉండగా గత వారం ఎఐసిసి టి.పిసిసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం తెలిసిందే. అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇరువురూ పాత వారే అయినా, కొత్త కార్యవర్గానికి ఇదో పరీక్ష అని చెప్పవచ్చు. కార్యవర్గంలోని ముఖ్య నేతలంతా పాలేరులో మకాం వేయనున్నారు. మరోవైపు దివంగత రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి పోటీ చేస్తున్నందున ప్రజల్లో సానుభూతి ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వెంకట్‌రెడ్డి సతీమణిని గెలిపిస్తేనే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ‘చే’జిక్కించుకుని, టిఆర్‌ఎస్ హవా తగ్గిందని, ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లిందని ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పాలేరును దక్కించుకోవడానికి, పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం పెంచడానికి ఎఐసిసి ముఖ్య నాయకులు సైతం వచ్చే నెల 2నుంచి ప్రచారానికి రానున్నారు.