తెలంగాణ

పర్యాటక స్థలాలుగా బమ్మెర, పాలకుర్తి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: భాగవతాన్ని తెలుగులో రచించిన బమ్మెర పోతన్న గ్రామమైన బమ్మెర, బసవ పురాణం వంటి ప్రసిద్ధ గ్రంధాలను రచించిన పాల్కురికి సోమనాథుడి గ్రామమైన పాలకుర్తి, వాల్మిడి గ్రామాలను కల్చరల్ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి పర్చాలని నిర్ణయించినట్టు పర్యాటకశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ మూడు గ్రామాలు కూడా వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి. సచివాలయంలో శుక్రవారం కల్చరల్ టూరిజం సర్క్యూట్‌పై అధికారులతో మంత్రి సమీక్షించారు. కల్చరల్ టూరిజం సర్క్యూట్‌ల ఏర్పాటుకు సంబంధించిన పనులు నెల రోజులలో ప్రారంభించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.

అసెంబ్లీ, కౌన్సిల్ ప్రొరోగ్
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ శాసనమండలి, శాసనసభల సమావేశాలను గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రొరోగ్ చేశారు. మార్చి 31వ తేదీన శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ప్రొరోగ్ చేసినట్లు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్ శుక్రవారం జివో జారీ చేశారు.