తెలంగాణ

పాలమూరులో 2300 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 2: ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ మేరకు మహబూబ్‌నగర్ పట్టణంలో బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి పునాది పడింది. జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సోమవారం స్థానిక క్రిస్టియన్‌పల్లి సమీపంలోని ఆదర్శనగర్‌లో భూమిపూజ చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి హామీ మేరకే పట్టణంలోని వీరన్నపేట, పాతతోట, పాతపాలమూరు మురికివాడల్లోని పేదలకు ప్రభుత్వం 2300 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేసిందని, ఇందులో భాగంగా ప్రస్తుతం తొలిదశలో దాదాపు 500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పాలమూరు పట్టణ పరిస్థితులు క్షుణ్ణంగా తెలుసని అందుకే తెలంగాణలో ఏ జిల్లాకు ఇవ్వని విధంగా పెద్ద మనసుతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి భారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయంచారని అన్నారు.