తెలంగాణ

పాలిసెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: సాంకేతిక విద్య, శిక్షణ మండలి పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ ప్రవేశపరీక్ష ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సాయంత్రం సచివాలయంలో విడుదల చేశారు. ఏప్రిల్ 21న నిర్వహించిన పాలిటెక్నిక్ పరీక్షకు 1,27,972 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,24,747 మంది పరీక్ష రాశారని, వారిలో 1,03,001 మంది అర్హత సాధించారని చెప్పారు. వీరిలో 64,784 మంది బాలురు, 38,217 మంది బాలికలు ఉన్నారన్నారు. పాలిసెట్‌లో మొత్తం 120 మార్కులకు గానూ 36 (30 శాతం) మార్కులు సాధించిన వారికి ర్యాంకులు ఇచ్చామని, ఎస్సీ, ఎస్టీలకు నిర్ధేశిత మార్కులు లేవన్నారు. పాలిసెట్‌లో మార్కుల ఆధారంగా అభ్యర్ధులకు మెరిట్ ర్యాంకులు ఇచ్చామని, మొత్తం మార్కులు సమానంగా సాధించిన అభ్యర్ధులకు తొలుత గణితంలో సాధించిన మార్కులను, ఆ తర్వాత భౌతిక శాస్త్రం మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించామని, అప్పటికీ మార్కులు సమానంగా ఉన్న అభ్యర్ధులకు పుట్టిన తేదీ ఆధారంగా ర్యాంకులు ఇచ్చామని వివరించారు. తర్వాత ఎస్సెస్సీ మార్కుల ఆధారంగా త్వరలో నిర్వహించే వెబ్ కౌనె్సలింగ్‌లో వారి ప్రతిభా క్రమాన్ని నిర్ణయించడం జరుగుతుందన్నారు. పాలిసెట్‌లో 120 మార్కులకు వంద శాతం మార్కులు సాధించిన అభ్యర్ధులు 8 మంది ఉన్నారని, ఎస్సెస్సీలో సాధించిన మార్కుల ఆధారంగా వీరి క్రమాన్ని నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు. ‘పాలిసెట్‌టిఎస్ డాట్ నిక్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌తో పాటు ‘డిటిఇ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్’, ‘ఎస్‌బిటిఇటి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్’ అనే వెబ్ సైట్లలో కూడా ఈ ఫలితాలను ఉంచామని, స్కాన్ చేసిన ఒఎంఆర్ జవాబు పత్రాలను ‘పాలిసెట్‌టిఎస్ డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్’ అనే వెబ్ సైట్ నుండి పొందవచ్చని చెప్పారు. పాలిటెక్నిక్ ప్రవేశానికి సంబంధించిన వెబ్ కౌనె్సలింగ్ 17వ తేదీన లేదా ఎస్సెస్సీ ఫలితాలు ప్రకటించిన మూడో రోజు తర్వాత ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్ధుల ధృవపత్రాల పరిశీలనకు సంబంధించి గానీ వెబ్ కౌనె్సలింగ్‌కు సంబంధించి గానీ మరో కాల్ లెటర్ పంపించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 28 ఇంజనీరింగ్, 4 నాన్ ఇంజనీరింగ్ బ్రాంచిలు సెకండ్ షిఫ్ట్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 11,560 సీట్లు, 169 ప్రైవేటు , రెండో షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కలిపి 46,520 సీట్లు ఉన్నాయని చెప్పారు.
120కి 120 మార్కులు
పాలిసెట్‌లో 120కి 120 మార్కులు సాధించిన ఎనిమిది మంది అభ్యర్ధుల్లో పొదిలి రిత్విక్ తేజ , నాగబోయిన భరత్ కుమార్, ఆళ్ల ధర్మ తేజ, పలివెల సాయి సీతారామ హరీష్, దాసరి అఖిల్, తంబాబత్తుల సత్య సాయి భూషణ్, కర్రి శ్రీ సిద్ధి, హనుమంతు సాయి లేఖ ఉన్నారు. 120కి 119 మార్కులు సాధించిన వారిలో సిద్ధంశెట్టి మానస, జిల్లేపల్లి నాగేందర్, రాంశెట్టి సృజన్ కుమార్, గుంటూరు దీక్షిత్, కుంట్ల తన్మయి రెడ్డి, పొందుగుల అభిలాష్‌రెడ్డి, ఆమంచి నవీన్ ఉన్నారు. పాలిసెట్ పరీక్షలో జిల్లాల వారీగా ఆదిలాబాద్ నుంచి 84.5, హైదరాబాద్ నుంచి 80.56, కరీంనగర్ నుంచి 82.13, ఖమ్మం నుంచి 87.40, మహబూబ్‌నగర్ నుంచి 81.90, మెదక్ నుంచి 78.65, నల్గొండ నుంచి 83.48 , నిజామాబాద్ నుంచి 81.31, రంగారెడ్డి నుంచి 81.72, వరంగల్ నుంచి 83.95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.