తెలంగాణ

నేటి నుంచి ఓపెన్ కాస్ట్ యాత్ర ప్రారంభించనున్న కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఎసి) ఆధ్వర్యంలో మంగళవారం ఉపరితల బొగ్గు గనుల (ఓపెన్‌కాస్ట్) అధ్యయన యాత్రను ప్రారంభిస్తున్నట్టు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌లో కొనసాగుతున్న దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత జయశంకర్ విగ్రహానికి నివాళులు ఆర్పించిన తర్వాత జెండా ఊపి యాత్రకు ప్రారంభించనున్నట్టు కోదండరామ్ తెలిపారు. ఆల్వాల్‌లో ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌కు చేరుకుంటుందని ఆయన తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన బాధ్యులతో కలిసి ఆర్‌కె-ఓసిని సందర్శించాక, మందమర్రి సమీపంలోని ఎర్రగుంటపల్లిలో భూ నిర్వాసితులు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బాధితులతో ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్నట్టు కోదండరామ్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయిన తర్వాత సాయంత్రం గోదావరి ఖనిలో జరిగే సదస్సులో బాధితులతో చర్చించి టిజెఎసి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఆందోళనకు కార్యాచరణను రూపొందించనున్నట్టు పేర్కొన్నారు.