తెలంగాణ

‘ఆరోగ్యశ్రీ’ కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఆరోగ్యశ్రీ సేవలపై ఏర్పడిన ప్రతిష్టంభనపై తెలంగాణ ప్రభుత్వం-ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధుల మధ్య సోమవారం సచివాలయంలో జరిగిన చర్చలు ఫలించాయి. ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు అంగీకరించాయి. వైద్య మంత్రి కె లక్ష్మారెడ్డి నేతృత్వంలో జరిగిన చర్చల్లో దాదాపు 20 మంది ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు రెండుగంటలపాటు చర్చలు కొనసాగాయి. ఈ చర్చల్లో మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఇతర అధికారులు సహకరించారు.చర్చల తర్వాత మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన నిధుల్లో తొలిదశలో 117 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేశామన్నారు. ఈ నిధులు ఒకటి రెండురోజుల్లో ఆసుపత్రుల అకౌంట్లలో వేస్తామన్నారు. వాస్తవంగా ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం 300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, బకాయిలుగా ఉండే మిగతా నిధులను 15-20 రోజుల్లో చెల్లిస్తామన్నారు. సాంకేతిక కారణాలవల్ల బకాయిల చెల్లింపులో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుత అవసరాలను పరిశీలిస్తే నెలకు 40 నుండి 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ఇక నుండి ప్రతినెలా ఈ మేరకు నిధులను చెల్లించాలని భావిస్తున్నామని చెప్పారు.ఆరోగ్యశ్రీ పథకంపై గతంలో ప్రభుత్వం-ప్రైవేట్ వైద్య సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమీక్షిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గత ఒప్పందంలో ఉన్న అవకతవకలను సరిదిద్దాల్సి ఉందని, ఇందుకోసం ప్రైవేట్ మేనేజ్‌మెంట్లు కూడా అంగీకరించాయని చెప్పారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్ఠం చేశామని, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా తమకు (ప్రభుత్వానికి) సహకరిస్తున్నాయని వివరించారు.
ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. మంత్రితో చర్చల తర్వాత మేనేజ్‌మెంట్ల ప్రతినిధులు డాక్టర్ నర్సింగ్‌రెడ్డి, డాక్టర్ పి విజయచందర్‌రెడ్డి, డాక్టర్ పి సుధీర్‌కుమార్, డాక్టర్ వి రాకేష్, డాక్టర్ ఎంఎస్ మూర్తి, డాక్టర్ హరిప్రకాశ్ తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన నిధుల బకాయిల అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ కారణంగానే ప్రైవేట్ వైద్య రంగంలో నిలిపివేయాలనుకున్న వైద్య సేవలను కొనసాగిస్తామని, రోగులకు ఎలాంటి ఇక్కట్లు రాకుండా చూస్తామని తెలిపారు. 2007 సంవత్సరంలో వైద్యసేవల ‘టారిఫ్’ నిర్ణయం అయిందని, ఈ అంశంపై సమీక్షించాలని తాము చేసిన డిమాండ్ పట్ల మంత్రి లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, వీటిపై చర్చించేందుకు మళ్లీ త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని వారు తెలిపారు.