తెలంగాణ

ఇదిగో.. ఐటీ క్లస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమల స్థాపనకు 30 కంపెనీలతో చర్చలు లక్షా 25 వేల మందికి ఉద్యోగావకాశాలు
త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 3: హైదరాబాద్‌లో మరో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ప్రక్రియను ముమ్మరం చేసినట్టు ఐటీ మంత్రి కె తారకరామారావు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే క్లస్టర్‌లో తమ కంపెనీలను స్థాపించేందుకు 30కి పైగా సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయన్నారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ స్థాయి బహుళ జాతి కంపెనీలు ఉన్నాయన్నారు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల లక్ష 25 వేల మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయన్నారు.
త్వరలో కొత్త క్లస్టర్‌కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేస్తారన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం బుద్వేల్, రాజేంద్రనగర్ ప్రాంతాలను మంత్రి కెటిఆర్ బుధవారం పరిశీలించారు. కొత్త క్లస్టర్‌లో స్థాపించే కంపెనీలు ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. ఐటీ పరిశ్రమలను నగరానికి నలు మూలలకు విస్తరించే దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోతున్నామని మంత్రి వివరించారు. కొత్త క్లస్టర్ వల్ల ఐటి పరిశ్రల మరింత విస్తరిస్తుందన్నారు. ఈ క్లస్టర్‌లో అన్ని వౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా పరిశ్రమల అభివృద్థి, వౌలిక వసతుల కల్పన సంస్థ అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్త క్లస్టర్‌లో స్థాపించే పరిశ్రమలు ఐదు సంవత్సరాలలో పూర్తిస్థాయి కార్యకలాపాలను ప్రారంభిస్తాయన్నారు. రాజేంద్రనగర్‌లో ప్రస్తుతం ఉన్న పలు ప్రభుత్వ సంస్థలు తమ ఆధీనంలోని భూములను పరిశ్రమల స్థాపనకు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. భూ యాజమాన్య మార్పులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. క్లస్టర్ ఏర్పాటుపై త్వరలోనే ఐటీ, రెవిన్యూ, టిఎస్‌ఐఐసి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నారని మంత్రి తెలిపారు.