తెలంగాణ

గజల్ శ్రీనివాస్‌కు బిగుస్తున్న ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలకు తోడు మరికొన్ని వీడియోలు కూడా వెల్లడి కావడంతో వాటి ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మరిన్ని ఇబ్బందులు శ్రీనివాస్‌కు పెరిగేటట్లు ఉన్నాయి. కార్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళను శ్రీనివాస్ లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీడియో ఫుటేజీలు, బాధితురాలి ఫిర్యాదులోని అంశాలను ఆధారం చేసుకుని కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న శ్రీనివాస్ నివాసంలో ఉన్న పని మనిషి నుంచి పోలీసులు ఇప్పటికే వాంగ్మూలం నమోదు చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని, నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. బాధితురాలు తాజాగా సమర్పించినట్లు చెబుతున్న మరికొన్ని వీడియో క్లిప్పింగ్‌లను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తదుపరి దర్యాప్తునకు, నేరారోపణ పత్రం తయారీకి వీటిలో ఉన్న అంశాలను ఆధారం చేసుకుంటారు. దీంతో నిందితుడికి బెయిల్ మంజూరు కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ముసుగులో శ్రీనివాస్ ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డం పట్ల సర్వత్రా విమర్శల దాడి జరుగుతోంది.
బాధితురాలు మీడియాతోనూ, సోషల్ మీడియా ద్వారా శ్రీనివాస్‌పై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. తనను బెదిరించే వాడని, ఉద్యోగం రాకుండా చేస్తానని, సర్ట్ఫికెట్ ఇవ్వనని ఇలా చాలా రకాలుగా ఇబ్బందిపెట్టే వాడని చెబుతోంది. పని మనిషి సావిత్రి సహకారంతో తనను లైంగిక వేధింపులకు గురిచేసే వాడని, తాను ఎవరికీ చెప్పుకోలేక మనోవేదన అనుభవించానని తెలిపింది. మరొకరికి ఇలా జరగకూడదనే తాను సెలబ్రెటీ ముసుగులో గజల్ శ్రీనివాస్ చేస్తున్న అకృత్యాలను బయటపెట్టినట్లు ఆవేదనతో చెబుతోంది. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందించానని, పోలీసులు తనకు ఎంతో సహకరించి నిందితుడ్ని అరెస్టు చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. గజల్ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఇదిలావుంటే రోజు రోజుకీ విడుదలవుతున్న కొత్త వీడియో క్లిప్పింగ్‌లకు తోడు గజల్ శ్రీనివాస్‌ను సేవ్ టెంపుల్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పించారు. అంబాసిడర్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకుడు వెలగపూడి ప్రకాశరావు ప్రకటించారు. తమ సంస్థలో మహిళలను దేవతల్లా భావిస్తామని, ఇలాంటి పరిస్థితిలో శ్రీనివాస్‌ను తప్పిస్తున్నట్లు వెల్లడించారు.