తెలంగాణ

గజ్వేల్ దవాఖానాలో బెడ్ల హెచ్చింపు 21 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: ముఖ్యమంత్రి కె. చందశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో దవాఖానా హోదాను పెంచారు. ఇప్పటి వరకు 50 పడకల దవాఖానాగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ / దవాఖానాను 100 పడకలకు పెంచారు. ఈ దవాఖానా నిర్వహణకు 21 కోట్ల రూపాయలు (2.20 కోట్లు రికరింగ్ అవసరాలకు, 18.50 కోట్లు నాన్-రికరింగ్ ఖర్చులకోసం) మంజూరు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఈ నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
నామినేటెడ్ పోస్టుల్లో బీసీ మహిళలకు ప్రాధాన్యం బీసీ మహిళా సంక్షేమ సంఘం డిమాండ్

హైదరాబాద్, జనవరి 3: బిసి మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. సావిత్రిభాయిపూలే జయంతి సందర్భంగా బిసి భవన్లో జరిగిన మహిళా సమావేశాంలో ఎర్ర సత్యనారాయణ ప్రసంగిస్తూ మంత్రివర్గంలో 27 శాతం విధిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. మహిళా బిల్లులో కూడా 50 శాతం బిసి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బిసి మహిళ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శారద గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా నాయకురాలు రమ్య, లక్ష్మి, జీవిత, ఇతర నాయకులు వేల్పుల బిక్షపతి, అంజి, సిలుముల అశోక్, సతీష్, రాంబాబు, శివశంకర్, నరసింహారావు, కుమార్ పాల్గొన్నారు.
వైద్య సేవలు, బోధనలో మీ పాత్ర కీలకం
మెడికల్ ప్రొఫెసర్స్‌తో భేటీలో గవర్నర్ నరసింహన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 3: రోగులకు సేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వ మెడికల్ ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మెడికల్ ప్రొఫెసర్లపై కీలక బాధ్యత ఉంటుందని, ఒకవైపు వైద్య విద్యార్థులకు సరైన బోధన చేస్తూ, మరోవైపు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే దవాఖానాల్లో రోగులకు సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. వైద్య, విద్య, ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని, వైద్య బోధనా సిబ్బంది సామాజిక బాధ్యతను తుచ తప్పకుండా నిర్వర్తించాలని కోరారు. వైద్య రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై సంఘం ప్రతినిధులు గవర్నర్‌తో చర్చించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ప్రొఫెసర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ జి. నర్సింహారావు తదితరులు ఉన్నారు.

పాఠశాలల్లో పౌష్టికాహారం ఉద్యమిస్తున్న అక్షయపాత్ర

హైదరాబాద్, జనవరి 3: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అదనంగా విద్యార్ధులకు చిరుధాన్యాలు అందించడం ద్వారా వారి పౌష్టకాహార సత్తువ పెంచుతున్నట్టు అక్షయపాత్ర ప్రతినిధి పి రోహిత్ చెప్పారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చిరుధాన్యాలు, కొన్ని చోట్ల మొక్కజొన్నతో చేసిన ఖాజా, చిక్కి, లడ్డూలను అందిస్తున్నామని, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండేలా వీటిని తయారుచేసి విద్యార్థలకు ఇస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లోని 880 పాఠశాలలకు చెందిన లక్ష మంది విద్యార్థులకు చిరుధాన్యాలను అందించే కార్యక్రమం నాలుగో తేదీ మధ్యాహ్నం ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా పాఠశాల విద్యాశాఖాధికారులు పాల్గొంటారని అన్నారు.