తెలంగాణ

ఈ పాలకులను గద్దె దించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో వారిని గద్దె దించడమే లక్ష్యంగా ఈ నెల 25వ తేదీన బహుజన డెమోక్రటిక్ లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఎం మహాసభల సందర్భంగా బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలను మాటలతో మాయచేస్తూ కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతామన్నారు. తమ ఫ్రంట్‌లో ఇప్పటికే అనేక సంఘాలు చేరాయని, త్వరలోనే సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కూడా చేరనున్నదని స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లో ఈ ఫ్రంట్ ప్రారంభమవుతుందన్నారు. ప్రారంభ సమావేశానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాష్ అంబేద్కర్ లాంటి ప్రముఖులతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, సంఘాల ప్రధాన నేతలు పాల్గొంటారన్నారు. దేశంలో నోట్లరద్దే పెద్ద కుంభకోణమని, ఆర్థిక రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యారని, మతోన్మాదానికి అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. నోట్లరద్దు, జీఎస్టీ పెద్దోళ్ళకోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల నుంచి గిరిజనులను బయటకు పంపించేందుకు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. వారికి ఇస్తానన్న మూడెకరాల భూమి ఇవ్వకపోగా గిరిజనుల పోడు భూములను బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. అడవి మీద గిరిజనులకు హక్కే లేదనడం అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభు త్వ పెద్దలే ఆదివాసీలు, లంబాడీల మధ్య చిచ్చుపెట్టారని, దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి గొడవలు పాలకవర్గాలకు లాభం చేకూరుస్తాయని గతంలో కూడా మాల మాదిగల మధ్య చిచ్చురేపారన్నారు. ఈ సమస్యలపై అఖిలపక్షాన్ని ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు.