తెలంగాణ

హైదరాబాద్‌లో ప్రతి ఐదుగురు చిన్నారుల్లో వ్యాధుల బారినపడే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: పాఠశాలల్లోని చిన్నారులకు ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశంలో అగ్రగామి సంస్థ అడ్రస్ హెల్త్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యార్థుల్లో ప్రపతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు యవ్వన దశకు చేరుకున్న తర్వాత జీవన శైలి, జీవ ప్రక్రియకు సంబంధించిన వ్యాధుల బారినపడే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. 36 ప్రైవేట్ పాఠశాలల్లో వివిధ వయసులు, ఆదాయవర్గాలకు చెందిన 18వేల మంది చిన్నారులపై నిర్వహించారు. ఊబకాయం కేసులు పెరుగుతున్నాయి. జంక్‌ఫుడ్, అనారోగ్యకరమైన జీవన శైలి కారణమని అడ్రస్ హెల్త్ ఫౌండర్ అండ్ సిఇవవో డాక్టర్ ఆనంద్ లక్ష్మణ్ తెలిపారు. పాఠశాల విద్యార్థుల్లో పలు వయస్సు విభాగాల్లో 13.5 శాతం మంది చిన్నారులు పలు దృష్టి లోపాలతో బాధపడుతున్నారు. అధ్యయనంలో పాల్గొన్న ప్రతి ముగ్గురులో ఒకరు దంత క్షయంతో ఇబ్బంది పడుతున్నారు. వివిధ వయస్సు వర్గాలకు చెందిన మొత్తం చిన్నారుల్లో 38 శాతం మంది దంతాల్లో రంధ్రాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
గుండె వైఫల్యంతో బాధపడుతున్న 70 ఏళ్లవ్యక్తికి నూతన విధానంతో చికిత్స చేసిన అపోలో
గుండె వైఫల్యంతో బాధఫడుతున్న 70 ఏళ్ల రోగికి నూతన వైద్య విధానంతో సరిచేసి క్రియాశీలక జీవితాన్ని గడిపే విధంగా చేసినట్లు అపోలో హైదర్‌గూడ కార్డియాలజిస్టు డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ వి సూర్యప్రకాశరావు, డాక్టర్ పిఎల్‌ఎన్ కపర్ధి తెలిపారు. లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ విధానంలో ఈ వైద్య చికిత్స చేశామన్నారు. రోగి ట్రిపుల్ వెస్సెల్స్ బ్లాక్ సమస్యతో బాధపడుతున్నారను. ఈ రోగికి అనేక సార్లు గుండపోటు వచ్చింది. ఎడమ జఠరికకు సహాయకపడే ఒక అత్యాధునిక పరికరం లెఫ్ట్‌వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ అనేకొత్త వైద్య విధానాన్ని అవలంభించినట్లు డాక్టర్లు తెలమిరు. గుండె వైఫల్యం చెందిన రోగులు, గుండె మార్పిడికి అర్హతలేనివారు, టెర్మినల్ హార్ట్ కలిగినన రోగులు, ఎటువంటి ఆఫ్షన్ లేని వారు ఈ కొత్త విధానంతో ప్రయోజనం పొందుతారన్నారు. ఈ శస్తచ్రికిత్సను 12 గంటల పాటు నిర్వహించారు. రోగి పూర్తిగాకోలుకున్నాడని వారు చెప్పారు.