తెలంగాణ

8 నుండి దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన ఈ నెల 8వ తేదీ నుండి 12 వ తేదీ వరకూ సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ జి కిషన్ బుధవారం నాడు చెప్పారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. ప్రతి రాష్ట్రం నుండి శాస్త్ర, సామాజిక అంశాలపై విద్యార్థులు సామూహికంగా తయారుచేసినవి 20, వైయుక్తికంగా తయారుచేసినవి 15, టీచర్లు తయారుచేసినవి 15 మొత్తం ఆరు రాష్ట్రాల నుండి 300 అంశాలపై ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుండి 650 మంది విద్యార్థులు, టీచర్లు, 200 మంది వాలంటీర్లు ఇందులో పాల్గొంటారని చెప్పారు. విశే్వశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం సమన్వయంతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు.