తెలంగాణ

బుక్ ఫెస్టివల్‌లో ‘స్కైబాబా’ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 3: తెలంగాణకు చెందిన రచయిత స్కైబాబా విజయవాడ నగరంలోని బుక్ ఫెస్టివల్‌కు రావడంతో కలకలం రేగింది. గతం లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆంధ్రాప్రజలకు వ్యతిరేకంగా ఆయన చేసిన రచనల్లో అసభ్యకర పదజాలం ఉపయోగించారని, అందుకు క్షమాపణ చెప్పాలని పలువురు భాషాభిమానులు, స్థానిక కవులు, రచయితలు అడ్డుకుని డిమాండ్ చేశారు. నాటి తెలంగాణా ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రాను కించపరుస్తూ స్కైబాబా కొన్న రచనలు చేశారు.
వాటిలో బూతులు కూడా ఉండటంతో ఇప్పుడు నగరానికి వచ్చిన ఆయనను ఇక్కడివారు అడ్డుకున్నారు. స్వరాజ్యమైదాన్‌లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన ‘జల్ జల’ అనే పుస్తకావిష్కరణకు ఆయనను ఇక్కడి నిర్వాహకులు పిలిచారు. దీంతో ఈ కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరుకాగా భాషాభిమానులు ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో స్కైబాబా రాసిన రాతలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని డిమాండు చేశారు. మా తెలుగుతల్లి పాట పాడిన తర్వాతే పుస్తకావిష్కరణ జరగాలని ఆందోళనకు దిగారు. అరే ఆంధ్రుడు నంగినంగి వేషాలు వద్దు నక్క తలుపులు ఇకపై చూపెట్టొద్దు, బెజవాడకు మెయిల్ కడతాం, బద్మాష్‌లంతా బదాయించాలి’ ఇలా ఆయన రాసిన కొన్ని అసభ్యకర రచనలను చదివి వినిపించారు. తమకంటూ ఆత్మగౌరవం ఉందని, స్కైబాబా సభా ముఖంగా క్షమాపణ చెప్పాలని నిలదీశారు. అయితే ఉద్యమం సమయంలో తాను అందరిలానే రచనలు చేశానంటూ క్షమాపణ చెప్పేందుకు స్కైబాబా ససేమిరా అన్నాడు. ఆందోళన శృతి మించుతున్న తరుణంలో రంగప్రవేశం చేసిన సూర్యారావుపేట పోలీసులు ఏసిపి శ్రీనివాసరావు ఆధ్వర్యాన పరిస్థితిని అదుపు చేశారు. రక్షణ వలయంలో స్కైబాబాను వాహనం ఎక్కించి పంపేయడంతో సద్దుమణిగింది.