తెలంగాణ

ముగ్గురు నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: గత నెల 28న నిజాంకాలేజీ సమీపంలో ఆర్టీసి బస్సును అటకాయించి కండక్టర్‌పై దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.9,496 నగదును ఎత్తుకెళ్లిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అబిడ్స్ ఎసిపి జి.్భక్షం రెడ్డి తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సిసి కెమెరాల ఫుటేజిల ఆధారంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. మహ్మద్ సర్‌ఫ్‌రాజ్, మహ్మద్ ముక్తాదర్, షబ్బర్ హుస్సేన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. దోచుకున్న నగదుతో పాటు వారు వినియోగించిన కారును సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 122 సిసి కెమెరాలను అమర్చామని, ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్ పిఎస్ వరకు ఉన్న మరో 200 కెమెరాలను సిసిటివి ప్రాజెక్టుకు అనుసంధానించబడి ఉన్నాయని వివరించారు. దీని ఆధారంగా నిందితుల కదలికలను పసిగట్టి పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో డిడి ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు, ఎస్‌ఐ లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
బస్సు తగుల పెట్టిన కేసులో నిందితులు అరెస్టు
జామియా ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన ఆర్టీసి బస్సును గత నెల 21న తగులబెట్టిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్‌జోన్ డిసిపి ఒక ప్రకటనలో తెలిపారు. చిలకలగూడ పోలీసు స్టేషన్‌పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆ బస్సు డ్రైవర్ కృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు నిందితుల గురించి ప్రత్యేక బృందాలు గాలించి చివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. బస్సు ఆగి ఉన్న సమయంలో ఇద్దరు యువకులు బస్సులో ఎక్కి కూర్చుని తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసి నిప్పంటించి వెంటనే దిగి వెళ్ళిపోయారని గుర్తించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురు అనుమానితులను ప్రశ్నించి చివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. హన్మకొండకు చెందిన 29 ఏళ్ల గోవింద్ నరేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థి కాగా, మరొకరు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం రాయలపల్లి గ్రామానికి చెందిన చాదర్‌ఘట్ వద్ద ఉన్న ఎంఎస్‌ఎస్‌ఎల్ కాలేజీలో ఎల్‌ఎల్‌బి చివరి సంవత్సరం చదువుతున్న 29 ఏళ్ల బెజ్జంకి అనిల్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు నార్త్‌జోన్ డిసిపి తెలిపారు.
నిందితులు ఇద్దరు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగ అరెస్టును నిరసిస్తూ, కృష్ణమాదిగను వెంటనే విడుదల చేయాలని ఈ రకంగా బస్సును తగులబెట్టినట్లు తమ విచారణలో నిందితులు వెల్లడించారని తెలిపారు. ఈ కేసును గోపాలపురం ఎసిపి కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసులు పర్యవేక్షణలో ఎస్‌ఐ కె.రాజేశ్ దర్యాప్తు చేశారు.