తెలంగాణ

18 నుంచి పల్లె పల్లెకూ తెలుగు దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడైన, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఈ నెల 18 నుంచి ‘పల్లె పల్లెకూ టిడిపి’ని తీసుకెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో టి.టి డిపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువారం (4న) నుంచి ప్రారంభించే నాయకత్వ శిక్షణా తరగతులు, 18 నుంచి ప్రారంభించే పల్లె పల్లెకూ టిడిపి కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశానంతరం రావుల మీడియాతో మాట్లాడుతూ నాయకులకు దిశానిర్ధేశం చేసేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై, రైతులు, యువకులు, కార్మికులు, మహిళల సమస్యలను ఇబ్బందులను శిక్షణా తరగతుల్లో పార్టీ శ్రేణులకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. పార్టీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు వేరే పార్టీలోకి చేరిపోయినా, కార్యకర్తలు చెక్కు చెదరలేదన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పల్లె పల్లెకూ టిడిపి పేరిట ప్రజల్లోకి వెళ్ళనున్నట్లు చెప్పారు.