తెలంగాణ

ప్రాజెక్టుల పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణ వేగం పెంచాలని సిఎం కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక లాంఛనాలు పూర్తిచేసి, అవసరమైన అనుమతులు ఇచ్చేశామన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపు అంశాలపై సిఎం కెసిఆర్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ పూర్తయ్యే వరకూ ఎదురు చూడకుండా పంపుహౌస్ ద్వారా నీరు పంపాలన్నారు. ఏడాదిన్నరలో కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకూ నీటిని పంపడం లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు రిజర్వాయర్లు సమాంతరంగా నిర్మాణం జరగాలన్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావును సిఎం ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో నిర్మించే రిజర్వాయర్ల భూసేకరణ బాధ్యత తీసుకోవాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను, కలెక్టర్ నీతిప్రసాద్‌కు ముఖ్యమంత్రి సూచించారు.
నిర్వాసితులకు ప్రాధాన్యం
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే వారిని పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. భూనిర్వాసితులకు అందించాల్సిన పరిహారం, రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష జరిపారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి ప్రాజెక్టులు కడతామని, ఎక్కువ ముంపు లేకుండానే రీడిజైన్ చేశామన్నారు. అయినప్పటికీ రిజర్వాయర్ల నిర్మాణం కోసం కొంత ముంపు తప్పదన్నారు. అలాంటి ప్రాంతాల్లో భూనిర్వాసితులు గూడు చెదిరిన పక్షుల్లా తయారవుతున్నారని, అలాంటి పరిస్థితులు తెలంగాంలో ఉత్పన్నం కాకుండా కొత్త జీవితం ప్రసాదించాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితులు కోల్పోయే వ్యవసాయ భూమికి ఇల్లు, పశువుల కొట్టం చెట్టు తదితర ఆస్తులకు కొత్త ఇంటి నిర్మాణానికి మూడింటికి చెక్కులను ఒకేసారి నిర్వాసితులకు అందించాలని ఆదేశించారు. ఏకమొత్తంలో డబ్బులు ఇవ్వడం వల్ల నిర్వాసితులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన ప్రాంతంలో స్థిరపడే అవకాశం కలుగుతుందన్నారు. స్థానికంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వాసితులతో మాట్లాడి అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ కోరారు. సమావేశంలో మంత్రులు టి హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సిఎఎస్ రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఓ ముఖ్యకార్యదర్శి సి నర్సింగ్‌రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
chitram....

ప్రాజెక్టులపై మంత్రి హరీశ్, అధికారులతో సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్