అంతర్జాతీయం

మొత్తం సొమ్ము చెల్లించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 3: ఎఫ్-16 యుద్ధ విమానాల కొనుగోలుకు తాము ఎలాంటి నిధులను సమకూర్చలేమని, అందువల్ల మొత్తం సొమ్ము ఇచ్చి వాటిని కొనుగోలు చేయాలని అమెరికా పాకిస్తాన్‌కు స్పష్టం చేయడంతో ఈ విమానాల కొనుగోలు సందిగ్ధంలో పడింది. మరోవైపు అమెరికా గనుక నిధులను సమకూర్చని పక్షంలో తాము ఆ విమానాలను వేరే దేశంనుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని పాక్ పరోక్షంగా బెదిరించింది. ‘ఈ విమానాల అమ్మకానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపినప్పటికీ దీనికోసం విదేశీ మిలిటరీ ఆర్థిక సహాయం (ఎఫ్‌ఎంఎఫ్) నిధులను ఉపయోగించడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తామని కొంతమంది ప్రముఖ సెనేటర్లు స్పష్టం చేశారు. అందువల్ల ఇందుకోసం జాతీయ నిధులను కేటాయించాలని మేము పాక్‌కు ప్రతిపాదన చేశాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, దాన్ని ఎప్పుడు పాక్‌కు తెలియజేశారనే విషయాన్ని ఆయన చెప్పలేదు.