తెలంగాణ

ఇసుకపై వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ఇసుక రవాణాపై ఉన్న నిబంధనలకు ప్రభుత్వం సవరించింది. స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇసుక రవాణాకు ఎండ్లబండ్లు, ట్రాక్టర్లను ప్రభుత్వం అనుమతించింది. అయితే తీసుకెళ్లే ఇసుకను ఒక చోట డంపు చేసి వ్యాపారం చేస్తే మాత్రం చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. స్థానిక అవసరాలకు ఇసుక కోసం ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని గనులశాఖ మంత్రి కల్వకుంట తారకరామారావు స్పష్టం చేసారు.
గనులశాఖ అధికారులతో మంత్రి కెటిఆర్ శుక్రవారం మెట్రోరైల్ భవనంలో సమావేశం నిర్వహించారు. ఇసుక నిల్వలు, సరఫరాలో మరింత పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇసుక రవాణాపై రాష్టస్థ్రాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ స్క్వాడ్‌లో పోలీసు, రెవిన్యూ, గనులశాఖ అధికారులు ఉంటారన్నారు. స్థానిక అవసరాల కోసం ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇసుక రీచుల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరుగడం లేదని అధికారులు మంత్రికి వివరించారు.
ఇసుక రవాణాకు ఉపయోగించే వాహనాలకు జిపిఎస్, ఆర్‌ఎఫ్ ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేసి శాటిలైట్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. సాంకేతిక సహాయంతో ఇసుక డంపుల గుర్తింపు, వాహనాల రాకపోకలు, ఓవర్ లోడింగ్‌లను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. ఇసుక రవాణా చేసే వాహనాలపై రవాణాశాఖ ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. గనుల రంగంలో ఆదర్శవంతమైన విధానాలు పాటిస్తున్నామని, అలాగే సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్‌రెడ్డి, గనులశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..ఇసుక రవాణాపై డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న గనుల శాఖ మంత్రి కేటీఆర్