తెలంగాణ

దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుర్కపల్లి, జనవరి 12: ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన దగాకోరు ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని టీడీపీ కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జీయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, మూడెకరాల భూ పంపిణీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, లక్షా 20వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీలిచ్చిన సీఎం కేసీఆర్ ఏ ఒక్క హామీని కూడా అమలుచేయకుండా దగా చేశారని విమర్శించారు. ప్రజల ఆశీస్సులు ఉం డటంతోనే తాను 25 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఏనాడూ తన స్వ ప్రయోజనాల కోసం పాకులాడలేదని, మీలో ఒక సేవకుడిగానే బతికానని చెప్పారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు పేరుకు మాత్రమేనని, నీళ్లన్నీ సూర్యాపేటకు వస్తాయని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఈ ప్రాంత ప్రజలను మోసగించడమేనని అన్నారు. ధర్మారం, బోరబండ, శామీర్‌పేట చెరువుల ద్వారా గొలుసుకట్టు చెరువులన్నీ నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలపాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి, నాయకులు వల్లందాసు పాపయ్య, సీత నారాయణ, మధుసూదన్‌రెడ్డి, పూర్ణచందర్‌రాజు, శ్రీనివాసులు, అమరేందర్‌రెడ్డి, బాలయ్య, బిక్షపతి, మోత్కుపల్లి రఘు, శ్రీరాంమూర్తి, వెంకటస్వామి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, సర్పంచ్ రమాదేవి, సంజీవ, బిక్షపతి, చంద్రహాస్, చంద్రం పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు