తెలంగాణ

అదనంగా రెండు కోట్ల పని దినాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణకు అదనంగా మరో రెండు కోట్ల ఉపాధి పని దినాలను కేటాయించాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్రాన్ని కోరారు. ఎన్‌ఐఆర్‌డిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జిత్ సిన్హాతో శుక్రవారం మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉపాధి హామీ అమలు తీరుపై చర్చించారు. తెలంగాణలో ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను అమర్‌జిత్ సిన్హా అభినందించారు. దేశంలోనే ఉపాధి హామీ అమలులో ముందున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.725 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి కోరారు. వంద శాతం బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా తెలంగాణను త్వరలో మార్చనున్నామని వివరించారు. ఇందు కోసం గ్రామాల్లో పారిశుద్ధ్యలోపం లేకుండా ఉపాధి హామీ కూలీని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.