తెలంగాణ

కార్యరూపంలోకి మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: కొత్త సంవత్సరంలో కొన్ని మెగా ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. శుక్రవారం పరిశ్రమ భవన్‌లో టిఎస్-ఐఐసి ప్రాజెక్టులపై సీనియర్ జర్నలిస్టు, రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు బి. సురేష్ రూపొందించిన 2018 క్యాలెండర్‌ను చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, టిఆర్‌ఎస్ నాయకుడు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలమల్లు మీడియాతో మాట్లాడుతూ నీటి పారుదల, విద్యుత్తు, అభివృద్ధి, సంక్షేమ రంగాలతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. మెగా ప్రాజెక్టులైన ముచ్చర్ల ఫార్మాసిటీ, జహీరాబాద్ నీమ్జ్, సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ పార్కు, వరంగల్ కాకతీయ టెక్స్‌టైల్ పార్కు, దండు మల్కాపూర్ ఎంఎస్‌ఎంఈ, టిఐఎఫ్, గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నదని ఆయన చెప్పారు. మెగా ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధిని సాధిస్తుందని చైర్మన్ బాలమల్లు అన్నారు. క్యాలెండర్ రూపొందించిన సురేష్‌ను చైర్మన్ అభినందించారు.