తెలంగాణ

ప్రగతి భవన్ ముట్టడికి టీడీపీ పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ తెలుగు దేశం పార్టీ (టిటిడిపి) రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రతాప్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒక విద్యార్థి చనిపోతే ప్రశ్నించినందుకు అరెస్టు చేయడం ఏమిటని టిడిపి నేతలు ధ్వజమెత్తారు. ప్రతాప్ రెడ్డి చేసింది దేశ ద్రోహమా అని నిలదీశారు. ఆయన అరెస్టుకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడించేందుకు ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేసిన నేతలను ముందస్తుగానే అరెస్టు చేశారు. టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణను పోలీసులు గృహనిర్భంధం చేశారు. అలాగే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న మరో నేత మందాడి శ్రీనివాసరావును కూడా పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతుంటే ఇంటింటికీ వచ్చి అరెస్టు చేయడాన్ని ఖండించారు. వీరేందర్‌గౌడ్ నేతృత్వంలో ఇంటి నుంచి బయలుదేరిన తెలుగు యువత నేతలను అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వీరేందర్‌గౌడ్‌ను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మిగిలిన నేతలు టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఇళ్ల వద్ద కూడా భారీగా పోలీసులను మోహరింప చేశారు. ప్రగతి భవన్ ముట్టడిని ముందస్తుగానే భగ్నం చేసేందుకు పోలీసులు వ్యవహరించిన తీరును టిడిపి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
టీ.టీడిపీ నేత రమణ మండిపాటు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మండిపడ్డారు. టీడీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన రమణతో పాటు అనేక మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకుడు ప్రతాప్ రెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రమణతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఇ.పెద్దిరెడ్డి, వీరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.