తెలంగాణ

మళ్లీ ఉనికి చాటుకున్న డ్రగ్స్ మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/రాజేంద్రనగర్, జనవరి 13: నగరంలో డ్రగ్స్ మాఫియా మళ్లీ పడగ విప్పింది. గుట్టుచప్పుడు కాకుండా, చాపకింద నీరులా డ్రగ్స్ నగరానికి సరఫరా అవుతున్నాయి. ఆరు నెలలుగా ఎక్సైజ్, పోలీసు విభాగం అధికారులు డ్రగ్స్‌పై కనె్నర్ర చేసినప్పటికీ డ్రగ్స్ దందా మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. డ్రగ్స్ సరఫరా చేసేవారికి ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పినా, ఏదో మార్గంలో నగరానికి మాత్రం డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. శనివారం మరో డ్రగ్స్ మాఫియా గుట్టు అయ్యింది.
చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఏకంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్స్ నగరానికి చేరుకుంటున్నాయి. షాద్‌నగర్ పోలీసులు, బాలానగర్ ఎస్‌వోటి పోలీసులు, శంషాబాద్ ఎస్‌వోటి పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ ముఠా గుట్టు రట్టయింది. దాదాపు నలుగురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్ డీసీపీ పద్మజా రెడ్డి, ఏసీపీ అశోక్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన యెల్లంపల్లి లోకేష్ (20), అనంతపూర్ జిల్లా చిన్నకొత్తపల్లి ఆముదాలకుంటకు చెందిన కమ్మదూరి సురేష్ రెడ్డి(20), అనంతపుర్‌కు చెందిన రత్నకటం దినకర్ అలియాస్ అరుణ్ కుమార్(21), కడప జిల్లాకు చెందిన కీసర మండలం నగరం గ్రామానికి చెందిన గొర్లమండేటి నారాయణ(22) మరో నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈజీ మనీ కోసం డ్రగ్స్‌ను అనంతపూర్, కడప జిల్లాల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తూ ఉండేవారు. శనివారం షాద్‌నగర్ పోలీసులు, బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు, శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు అరాంఘర్‌లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1.810 కిలోల (జిహెచ్‌బీ) గామా హైడ్రాక్సీ బ్యూట్‌రేట్(నార్కోటిక్ డ్రగ్)ను, ఒక మారుతీస్విఫ్ట్ డిజైర్ కారు, ఒక టాటా ఇండియా విస్టా కార్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మరో నలుగురిని షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
935 గ్రాముల డ్రగ్స్ పట్టివేత
షాద్‌నగర్ రూరల్: అక్రమంగా డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు షాద్‌నగర్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం షాద్‌నగర్ 44వ జాతీయ రహదారి బైపాస్‌పై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా నుండి హైదరాబాద్ వైపు కారులో వెళ్తున్న దాసరి బాబు, శ్రీ్ధర్‌రెడ్డి, మహేందర్, అమర్‌నాథ్‌ను అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న కారును పరిశీలించగా అందులో మాదకద్రవ్యాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
అనంతపురం నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువెళ్లి విక్రయించే వారని, వారి నుండి 935 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎనిమిది మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, వారిలో నలుగు మాత్రమే షాద్‌నగర్ బైపాస్ రహదారిలో పట్టుపడ్డారని వివరించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారు అనంతపురం, కడప జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మరో నలుగురు రాజేంద్రనగర్ వద్ద పట్టుబడ్డారు. షాద్‌నగర్‌లో దొరికిన నలుగురిని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 935 గ్రాముల డ్రగ్స్‌తోపాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
చిత్రాలు... ఏసీపీ అశోక్‌తో కలిసి వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ పద్మజారెడ్డి
*షాద్‌నగర్ పోలీసులు పట్టుకున్న డ్రగ్స్