తెలంగాణ

నేటినుంచి మహా చండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: లోకకళ్యాణం, విశ్వశాంతి కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీయాగం బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాబోతుంది. చండీయాగానికి ముందు చేయాల్సిన పూజా కార్యక్రమాలను మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య వారు యాగశాలలోకి ప్రవేశించారు. ఆ తర్వాత రుత్విజులు వి ఫణి శశాంక శర్మ, గోపికృష్ణశర్మ, సిహెచ్ హరినాథ శర్మ ఇతర వేద పండితులు శృంగేరి పిఠాధిపతి భారతీతీర్థ స్వామివారి ‘గురువు చిరుతావళి’ పఠించారు. యాగశాలలో శివ పార్వతుల విగ్రహాల ముందు ఏర్పాటు చేసిన హోమ గుండం వద్ద జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ‘జయ మంగళగౌరి...్భద్రకాళి...సర్వమంగళ...ఆయ ముహుర్తు సుముహర్తస్తు...లోకాభిరామం శ్రీరామ...గంగాధిపతయ నమ:...క్షేత్రపాలాయనమ:’అంటూ కేశవ నారాయణ నామాలు పఠించారు. మంగళవాయిద్యాల మధ్య సాగిన కార్యక్రమంలో శే్వతవరాహకల్పే...అంటూ మహా సంకల్పం చెప్పారు. విశ్వ కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ తలపెట్టిన ఈ యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని మహా గణాధిపతి పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరూ హోమగుండం చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఆ తర్వాత త్రైలోక్యమోహన గౌరీ హోమం నిర్వహించారు. ఇందులో భాగంగా పదివేల సార్లు గౌరీ జపం, వేయి హోమాలు చేశారు. యగానికి వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని, క్రమశిక్షణతో మనస్సు లగ్నం చేయాలని గౌరీ హోమం ద్వారా రుత్విజులు ఆకాంక్షించారు. పూజల్లో భాగంగా ఉదకశాంతి, ఆచార్యాది రుత్విగ్వరణం, మహా మంగళ హారతి, మంత్రపుష్పం తదనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. రుత్విజుల ఆశీర్వచనంతో కార్యక్రమం ముగిసింది.

చిత్రం.. అంకురార్పణ పూజల అనంతరం యాగశాలలో పవిత్రతను కోరుకుంటూ మంత్రాక్షతలు జల్లుతున్న కెసిఆర్ దంపతులు