తెలంగాణ

నాగం దారి ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: భారతీయ జనతా పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధనరెడ్డి తీరు పార్టీ అగ్రనేతలను ఆందోళనలో పడేస్తోంది. కొద్ది కాలంగా పార్టీ తీరుతెన్నులపై గుర్రుగా ఉన్న నాగం జనార్ధనరెడ్డి బహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛగా వ్యవహరించిన నాగం జనార్ధనరెడ్డి బిజెపిలో సంప్రదాయ చట్రంలో పనిచేయడానికి ఇబ్బంది పడినా జాతీయ నాయకత్వాన్ని చూసి పార్టీకోసం పనిచేసేందుకు మంచి అవకాశాలు రాకపోతాయా అని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో ఇటీవలి కాలంలో తన నిరసనను తెలుపుతునే ఉన్నారు. పార్టీ వీడి వెళ్లాలనేది తన తక్షణ కార్యాచరణ కాకపోయినా, అసంతృప్తిని వ్యక్తం చేయడం ద్వారా నాయకత్వంపై తీవ్రమైన వత్తిడి తీసుకురావడంలో నాగం విజయం సాధించారు. అయితే ఇటీవల మరొక అడుగు ముందుకు వేసి త్వరలో తన కార్యాచరణ వెల్లడిస్తానని అనడం గుబులు పుట్టిస్తోంది. కార్యాచరణ అంటే బిజెపిలో ఉంటూ అధికార పార్టీపై పోరు సాగించడానికి ఉద్ధేశించిందా లేక నేరుగా పార్టీ వ్యవహార సరళిపైనే తిరుగబాటు బావుటా ఎగురవేస్తారా అనే మీమాంసలో పార్టీ నేతలున్నారు. గతంలో నీటిపారుదల ప్రాజెక్టులలో అంతులేని అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో సహా నాగం టిఆర్‌ఎస్‌పై ఎలుగెత్తారు. అది పార్టీలో కొంత మంది నేతలకు నచ్చలేదనే ప్రచారం కూడా జరిగింది. 36 ఏళ్ల రాజకీయ అనుభవం తనకు ఉన్నా కనీసం తనను పట్టించుకోవడం లేదని, ఆత్మగౌరవం లేని చోట ఉండొద్దని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని ఇటీవల కొంత మంది వద్ద నాగం బయటపడినట్టు తెలిసింది. కార్యకర్తల అభీష్టం మేరకు ఉగాది తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెబుతున్నారు. జాతీయ నాయకత్వాన్ని రాష్ట్ర నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించినట్టు సమాచారం. తెలంగాణలో బిజెపి భవితవ్యంపై ఆయన అంచనాలు వేస్తున్నట్టు తెలుస్తోంది. సిఎం కేసీఆర్ కుటుంబం, ప్రభుత్వ అవినీతిపై తాను మాట్లాడుతుంటే వద్దని చెబుతున్నారనేది నాగం ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు నుండి నాగం ఇంత వరకూ ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ నేపథ్యంలో టిడిపికి రాజీనామా చేసి తెలంగాణ నగారాను స్థాపించారు. 2012లో ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగి గెలుపొందిన తర్వాత ఆయన బిజెపిలో చేరారు. బిజెపి తరఫున మహబూబ్‌నగర్ నుండి ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న నాగం జనార్ధనరెడ్డి ఈ అంశంపై పలువురు ప్రశ్నించడంతో ఇటీవలె పార్టీ కార్యాలయానికి వచ్చారు.