తెలంగాణ

ఆత్మబలిదానాలు చేసుకున్న వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జనవరి 13: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను, ఉద్యోగ, కర్షకులను, కులవృత్తులందరినీ విస్మరించి తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకోవడం వల్ల తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ విస్తరణలో భాగంగా రెండు రోజుల పర్యటన జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్వహించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పట్టణాధ్యక్షుడు రవికుమార్ ఎక్బోటే నివాసంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ విస్తరణలో భాగంగా పల్లె నుంచి పార్టీని పటిష్టం చేయడం కోసం పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, రాజకీయంగా వెనుకబడిన గద్వాల జిల్లాను 2019లో ప్రాతినిధ్యం పొందేందుకు వ్యూత్మాహకంగా భాజపా రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలపైనా ప్రత్యేక దృష్టి కొనసాగిస్తుందన్నారు. అందులో భాగంగా జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో హమీలు ఇచ్చి గద్దెనెక్కిన తరువాత గద్వాల ప్రాంతాన్ని అన్ని విధాలుగా విస్మరించారన్నారు. దశాబ్దాలుగా పాలిస్తున్న పాలకులు గద్వాల ప్రాంతంపై వివక్ష చూపెట్టడం వల్ల సాగునీరు, తాగునీరు అందక నడిగడ్డ ప్రాంతం ఎడారిగా మారడానికి గత పాలకులే బాధ్యత వహించాలన్నారు. తలాపున సెలఏర్లు ఉన్నా సాగు, తాగునీరు అందించడంలో పాలకులు విఫలమయ్యారని, ప్రభుత్వాలు, పాలకులు మారినా భారీ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారే కానీ ప్రజల కన్నీటి వ్యథలను ఈ ప్రభుత్వం తీర్చలేక పోతుందన్నారు. ఉద్యమ సందర్భంలో సీఎం కేసిఆర్ ప్రస్తావించిన అంశాలు, ప్రాజెక్టుల నిర్మాణ హమీలు అటకెక్కిపోయాయని, ఆనాడు ఉద్యమ సమయంలో మన కళ్ల ముందు పారుతున్న కృష్ణానది కాళ్లు అడ్డం పెడితే మన ఇళ్లలోకి పొల్లాలోకి సాగు, తాగునీరు అందిస్తానన్నా సీఎం కేసీఆర్ మాటలు నేడు ప్రగతి భవన్ గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో విత్తనోత్పత్తికి పేరుగాంచిన గద్వాల ప్రాంతంలో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ఏమాత్రం ప్రతి ఫలాలు అందడం లేదని, దళారులు చేతుల్లో, నకిలీ విత్తనాల కంపెనీల వల్ల రైతులు మోసపోతున్నారని, పీడియాక్టు కింద కంపెనీల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులు ఆదుకోవడానికి హ్యాండ్లూమ్ పరిశ్రమ నెలకొల్పాలని నాడు శంకుస్థాపన చేశారు...కాని నేటి వరకు ప్రారంభమైన దాఖలాలు లేవన్నారు. చేనేత కార్మికుల పేరుతో బతుకమ్మ చీరల పంపీణీ పేరుతో నాసిరకమైన చీరలు పంపిణీ చేసి రూ.100 కోట్ల కుంభకోణం చేసిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కిందన్నారు. ఆర్డీఎస్ పేరిట నడిగడ్డ ప్రాంతానికి సాగు నీరు అందిస్తానని, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. స్వయంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ద్రోహుల దగ్గరకు వెళ్లాలంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయని బాహాటంగా విమర్శలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం స్పందిచండం లేదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అవినీతి పాలన అంతం చేయడానికి బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి బాటలో దూసుకెళ్తుందని, 2019 లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి పావులు కదుపుతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయ న అన్నారు. నిరుద్యోగ పోరుబాట, దళిత అదాలత్, గిరిజన గర్జన, బీసీ సంగ్రామం, రైతు పోరుబాట, మద్యం మీద యుద్ధం, కార్యక్రమాలతో 2018 సంవత్సరాన్ని ఉద్యమ, పోరుబాట సంవత్సరంగా బీజేపీని గ్రామాల నుంచి పటిష్టపరిచి దేశవ్యాప్తంగా భాజపా బలోపేతానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. దక్షిణాదిలో కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రానుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా పాగా వేయడానికి కాంగ్రెస్ ముక్త్ నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం చొరవతో చేనేత కార్మికులకు బాసటగా నిలుస్తామని, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. రైల్వే, మెడికల్ ఇన్‌స్టిట్యూట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు భరత్‌గౌడ్, శ్రీనివాస్, నర్సింగ్‌రావు, శ్రీకాంత్, అప్సర్‌పాషా, యాదగిరిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, అక్కలరమాదేవి, మధుగౌడ్, కేకే రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.