తెలంగాణ

మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్న జైళ్ల శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ద్వారా ఖైదీలను విడుదల చేసేందుకు ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఇంకా వారం రోజులే వ్యవధి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకూ లేదు. దాదాపు 1235 మంది వరకు ఐదేళ్లకు పైబడి శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలు ఉన్నట్లు జైళ్ల శాఖ ఇప్పటికే అంచనా వేసింది. తెలంగాణ హోంశాఖ అధికారికంగా మార్గదర్శకాల జివోను జారీ చేయలేదు. ఆ జివో జారీ మేరకు అర్హులైన వారి అసలు జాబితాను జైళ్ల శాఖ తయారు చేయాల్సి ఉంది. ప్రభు త్వం నుంచి మార్గదర్శకాలు వస్తే ఆ మేరకు ఎవరు క్షమాభిక్షకు అర్హులో తేలుతుందని ఇటీవలే జైళ్ల శాఖ డిజి వికె సింగ్ చెప్పారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం ఖైదీల క్షమాభిక్షకు మార్గదర్శకాలను విడుదల చేయకపోవడంతో రాజకీయంగా పలు విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ ఏర్పడితే అర్హులైన అందరికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రతిపక్ష, ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. తెలంగాణ హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను తయారు చేసి జైళ్ల శాఖకు పంపిస్తే, ఆ మేరకు అర్హుల జాబితా తయారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అది ఆమోదించబడి అర్హులైన ఖైదీల విడుదలకు లైన్ క్లియర్ అవుతుంది. దీంతో క్షమాభిక్షతో విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమ వాళ్లను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని ఎదురు చూస్తున్న ఖైదీలు, వారి కుటుంబీకుల్లో ఉత్కంఠ నెలకొంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే వచ్చే ఏడాది వరకు ఆగాల్సి వస్తుంది.