తెలంగాణ

నేటి నుంచి ‘సకల నేరస్థుల సమగ్ర సర్వే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరస్తుల జాబితా తయా రు చేసేందుకు ‘సకల నేరస్తుల సమగ్ర సర్వే’ను పోలీస్ శాఖ ఈ నెల 18 నుంచి చేపట్టనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని నేరస్తుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ అడుగు ముందుకేసింది. ఈ మేరకు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి బుధవారం అన్ని జిల్లాల ఎస్సీలు, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేశా రు. నేరస్తులు ఎవరు, నేర చరిత్ర ఏ మేరకు ఉంది, తరచూ నేరాలు చేసే వాళ్లా, ఏ తరహా నేరాలకు పాల్పడే వాళ్లు వంటి సమగ్ర వివరాలతో ఇంటింటికీ తిరిగి ఈ సర్వే చేపట్టేందుకు పోలీస్ శాఖ నిర్ణ యం తీసుకుంది. ఈ నెల 1న టిఎస్ కాప్ మొ బైల్ యాప్‌ను ప్రారంభించి సాంకేతికత ఆధారంగా నేరస్తుల కదలికలపై కనే్నసి ఉంచేందుకు పోలీసు శాఖ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే నేరస్తుల జాబితా తయారు చేసి ఆ జాబితాను టిఎస్ కాప్‌కు అనుసంధానం చేయడం ద్వారా నేరస్తుల సమాచారం, కదలికలు చాలా సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇలా గుర్తించిన నేరగాళ్లందరిని జియో ట్యాగింగ్ చేసేందుకు నిర్ణయించారు.
కింది స్థాయి ర్యాంక్ అధికారి నుంచి డిజిపి స్ధాయి వరకు సంబంధిత పరిధిలోని ఆవాసాల్లోకి వెళ్లి గత 10 ఏళ్ల గా నేరచరిత్ర ఉన్న, పదే పదే నేరాలకు పాల్పడే వారి వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బృందాలను తయా రు చేసుకుని నేరస్తుల గణన చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రైమ్ రికార్డులను అనుసరించి జాబి తా తీసుకుని ఆ చిరునామాకు వెళ్లి స్వయంగా విచారణ చేసి సమగ్ర వివరాలు సేకరించాలని డిజిపి స్పష్టం చేశారు.