తెలంగాణ

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై అభాండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: కార్పొరేట్ విద్యావ్యవస్థకు కొమ్ముకాసేందుకే విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేయడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. బుధవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యావ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఢిల్లీలో వ్యాఖ్యనించడం చూస్తుంటే దయ్యా లు వేదాలు వల్లించినట్టుందని, ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు ఆయన తీరు ఉందని లక్ష్మణ్ ఆరోపించారు. విద్యా ప్రమాణాలు మెరుగుకు రాష్ట్రప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని, దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అధమ స్థానంలో ఉందని, తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నెపం మోపాలని చూస్తోందని లక్ష్మణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే అట్టడుగు నుండి నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. గద్వాల్ జిల్లా గట్టు మండలం దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత ఉందని , తెలంగాణ సాధించి మూడున్నరేళ్లలో ఒరగబెట్టింది ఏమిటని నిలదీశారు. నిరక్షరాస్యత నిర్మూలనలో కనీస చర్యలు తీసుకోలేదని, ఖాళీలను ఏమాత్రం భర్తీ చేయలేదని, వినూత్న పద్ధతిలో విద్యావ్యవస్థను మెరుగుపరుస్తున్నామని పదే పదే చెప్పే డిప్యుటీ సిఎం ఏం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోవడం, క్రమబద్ధీకరణ పేరుతో 5వేల పాఠశాలలను విలీనం చేశారని, దీని వల్ల దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక అర్ధాంతరంగా చదువులు మానేస్తున్నారని అన్నారు.