తెలంగాణ

రైతుల ఆదాయం పెంచవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: రైతుల ఆదాయాన్ని 2022 సంవత్సరం వరకు రెట్టింపు చేయవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొన్నారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి) లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) బుధవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పలువురు నిపుణులు, అధికారులు మాట్లాడారు. రైతుల ఆదాయం పెరిగేందుకు సరైన ప్రణాళిక రూపొందించాలని, పంటలపై పెట్టుబడులు తగ్గేలా చూస్తూ, పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగేలా చూడటం, పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడటంపై ప్రత్యేక ప్రణాళిక అవసరమన్నారు. ప్రస్తుతం రైతుల నెలవారీ ఆదాయం 6426 రూపాయలు ఉన్నట్టు తేలిందని, అందువల్ల రైతుల ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. పెట్టుబడి విపరీతంగా ఉండటం, పంటల ఉత్పత్తులకు సరైన ధర లభించకపోవడం వల్లనే రైతుల ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సమూల సంస్కరణలు చేయాల్సి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి మోహన్ కందా పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా రైతులు దృషి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు సరళీకరణ విధానాలు అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగరావు పేర్కొన్నారు. సిజిజి డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే ఆహుతులకు ఆహ్వానం పలుకుతూ, పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధర రాకపోవడం తదితర కారణాల వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి ధీనంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని సిజిజి డైరెక్టర్ ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ప్రభుత్వానికి ఒక సవాల్‌గా ఉందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రముఖ శాస్తవేత్తలు తమ అభిప్రాయాలను లీడ్‌పేపర్ల రూపంలో అందచేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ సంస్కరణల్లో ఈ వర్క్‌షాప్ భాగంగా నిలుస్తోంది.
వైద్య ఆరోగ్య బడ్జెట్‌పై కసరత్తు
2018-19 సంవత్సరానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌పై సంబంధిత మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి బుధవారం సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. హైదరాబాద్ (వెంగళరావునగర్) లోని ఇండియ న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టిఎస్‌ఎంఎస్ ఐడిసి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, ముఖ్యకార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వర్కషాప్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం