తెలంగాణ

స్వాధీనం చేసుకోని భూముల రికార్డుల్లో టీఎస్‌ఐఐసీ పేరు తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ శివార్లలో ఆదిబొట్ల ప్రాంతంలో కొంతమంది భూ యజమానులకు సంబంధించిన భూములు టిఎస్‌ఐఐసి పేరు మీద ఉన్న రెవెన్యూ రికార్డుల్లో ఉందని, ఈ రికార్డుల్లో నుంచి టిఎస్‌ఐఐసి పేరును తొలగించాలని హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. చాలా సంవత్సరాల క్రితం ఈ భూములను సేకరించినా, ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదని, కాని రికార్డుల్లో తమ భూములు టిఎస్‌ఐఐసి పేరు మీద ఉన్నాయని, ఈ మపేరును తొలగించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. కె కృష్ణ, మరో ఇద్దరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. తమకు చెందిన 25 ఎకరాల భూమిని తామే అనుభవిస్తున్నా, రికార్డుల్లో టిఎస్‌ఐఐసి పేరు ఉందని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. భూ సేకరణ చట్టం 1894 కింద 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎపిఐఐసి ఈ భూమిని సేకరించిందని, కాని ఈ భూమిని తాము అనుభవిస్తున్నామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. టిఎస్‌ఐఐసి అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ భూమి పిటిషనర్లదేనని, ఈ భూమికి సంబంధించి అవార్డును 2006 ఫిబ్రవరి 1వ తేదీన మంజూరైందని, కాని ఇంతవరకు తమ స్వాధీనం కాలేదని టిఎస్‌ఐఐసి కోర్టుకు తెలిపింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పిటిషనర్ల భూమికి సంబంధించి రికార్డుల్లో టిఎస్‌ఐఐసి పేరును తొలగించి, భూమి యజమానుల పేర్లను చేర్చాలని హైకోర్టు ఆదేశించింది.