తెలంగాణ

‘కవ్వాల్’ నుంచి రెండు గ్రామాల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు కోర్ ఏరియా నుంచి రెండు గ్రామాలు తరలివెళ్లడానికి రెండు గ్రామాలు సుముఖత వ్యక్తం చేసాయి. టైగర్ ప్రాజెక్టు నుంచి తరలించే గ్రామాలకు అత్యంత మెరుగైన పునరావాసం కల్పించాల్సిందిగా అటవీశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. రాష్ట్రంలో కవ్వాల్, అమ్రాబాద్ రెండు టైగర్ ప్రాజెక్టు కోర్ ఏరియా నుంచి తరలివెళ్లడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారిని మానవవతా కోణంలో చూడాలని సిఎస్ సూచించారు. సచివాలయంలో బుధవారం పులుల సంరక్షణ జాతీయ అథారిటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ (సౌత్) సోమశేఖర్‌తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, టైగర్ ప్రాజెక్టు పునరావాస అమలు కమిటీ సమావేశమైంది. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు కోర్ ఏరియాలో మొత్తం 23 గ్రామాలు ఉండగా నిర్మల్ జిల్లా రాంపూర్, మైసంపేట్ రెండు గ్రామాలకు చెందిన ప్రజలు మైదాన ప్రాంతానికి తరలి వెళ్లడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు అటవీశాఖ అధికారులు సిఎస్‌కు వివరించారు. ఈ రెండు గ్రామాల ప్రజల పునరావాసానికి రూ.14.20 కోట్ల ఇవ్వడానికి పునరావాస అమలు కమిటీ ఆమోదం తెలిపినట్టు సిఎస్ వెల్లడించారు. ఈ నిధులను జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సూచనల మేరకు పునరావాస చర్యలు చేపడతామని సిఎస్ వివరించారు. అథారిటీ మార్గదర్శకాల మేరకు ఏక మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. పునరావాసం పొందే కుటుంబాలకు నేరుగా డబ్బు అందచేస్తామన్నారు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరిస్తే వాటితో ప్రభుత్వమే పునరావాస చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ రెండు ప్రతిపాదనల్లో దేనినైనా బాధితులు ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. మైదాన ప్రాంతాల ప్రజలకు అందిస్తున్న పౌర సేవలన్నింటినీ తరలివచ్చే వారికి కల్పిస్తామని సిఎస్ వివరించారు. పునరావాసానికి ఖర్చు చేసే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయన్నారు. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి తరలివచ్చే పులులకు శాశ్వత ఆవాసాలను ఏర్పాటు చేయాలని సిఎస్ సూచించారు. టైగర్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలకు చిక్కిన పులులు, ఇతర జంతువుల చిత్రాలను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ పికె ఝూ సిఎస్‌కు చూపించారు.