తెలంగాణ

ఫీజుల బాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: అధిక ఫీజులతో ఒక పక్క స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్ధులు ఉక్కిరి బిక్కిరి అవుతుండగా మరో పక్క వౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ సైతం ఫీజులను అమాంతం పెంచడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా యాజమాన్యం మాత్రం ససేమిరా అంటోంది. యూనివర్శిటీ తీరుపై యూనివర్శిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు అతవుల్లా నియాజీ , ఉపాధ్యక్షుడు అబ్దుల్లా అస్లాం, కార్యదర్శి నెహల్ అహ్మద్, అలిజా ఫాతిమా, మహ్మద్ ఫైజల్ తదితరులు యూనివర్శిటీ మొండి వైఖరిని తప్పుపట్టారు. ప్రతి సెమిస్టర్‌కు ఉన్న ఫీజును దాదాపు రెట్టింపు చేయడం దారుణమని అన్నారు. ఎంఎస్‌డబ్ల్యు కోర్సునకు గతంలో సెమిస్టర్ ఫీజు 750 రూపాయిలు కాగా దానిని 1500 చేశారని, ఎంబిఎ సెమిస్టర్ ఫీజు 3500 నుండి 4వేలకు, జెఎంసి సెమిస్టర్ ఫీజును 2500కు, బిటెక్ /ఎంటెక్ సెమిస్టర్ ఫీజును 3వేల నుండి 4 వేలకు, బిఇడి/ఎంఇడి ఫీజును 4వేలకు, బిఎ/బికాం సెమిస్టర్ ఫీజును 750 రూపాయిలకు, బి.ఎస్సీ వెయ్యి రూపాయిలకు, డిఇడి ఫీజు 1500కు పెంచారని వారు పేర్కొన్నారు. సెమిస్టర్ లెక్కల్లో చెప్పడం వల్ల వార్షిక ఫీజు ఎక్కువగా పెరిగినట్టు కనిపించదని, కాని ఏటా 1500 రూపాయిలు ఫీజు పెంపు సామాన్య విద్యార్థులకు చాలా భారమని పేర్కొన్నారు. ఒక పక్క బాలికలను చదివించండి అని చెబుతున్న ప్రభుత్వం బాలికల ఫీజులను మాత్రం పెంచుతుంటే తల్లిదండ్రులు బాలికలను ఎలా చదివిస్తారని వారు ప్రశ్నించారు. బాలికల చదువులకు ఎన్నో ఆటంకాలు ఉంటాయని, వాటిని అధిగమించి యూనివర్శిటీలో చేరే సరికి కళ్లు బైర్లుకమ్మే ఫీజులకు తల్లిదండ్రులు వారి చదువును ఆపేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజులను తగ్గించి, యూనివర్శిటీని కాపాడాలని అన్నారు. మైనార్టీలకు విద్య అందుబాటులోకి తెచ్చామని చెబుతూనే మరో పక్క ఫీజుల కుంపటిని వారి తలకెత్తుతోందని విద్యార్థి సంఘం నేతలు పేర్కొన్నారు.