తెలంగాణ

ప్రధాన న్యాయమూర్తి బెంచికి విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజ్ మార్కుల కేటాయింపునకు సంబంధించిన కేసు హైకోర్టులో కొత్త మలుపు తిరిగింది. సబ్ ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి 20 మార్కులను కాంట్రాక్టు ఉద్యోగులకు కేటాయించాలన్న తెలంగాణ ట్రాన్స్‌కో నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ల దాఖలు చేసిన పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపించారు. దీని వల్ల డైరెక్ట్ రిక్రూటర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కేసును రెండు బెంచిలు విచారించాయి. ఒక బెంచి వెయిటేజి ఇవ్వడం సబబు అని తీర్పు ఇవ్వగా, మరో బెంచి ఇద్దరు అభ్యర్థుల్లో కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నప్పుడే వెయిటేజిని పరిగణనలోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశం మేరకే తాము వెయిటేజి ఇచ్చామని ట్రాన్స్‌కో తరఫున న్యాయవాది జి విద్యాసాగర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసును శుక్రవారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి బెంచి విచారిస్తే బాగుంటుందని అభిప్రాయపడి కేసును సిజె బెంచికిబదలాయించారు. దీని ప్రకారం రిజిస్ట్రీలో కేసును నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
రాజీవ్ త్రివేది, అనురాధపై కోర్టు ధిక్కార కేసును
అనుమతించిన హైకోర్టు
సుప్రీం కోర్టు ఆదేశం మేరకు రాష్ట్రప్రభుత్వం పోలీసు శాఖలో సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు తెలంగాణరాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇదే శాఖకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ఆంధ్రాలో హోంశాఖకు ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఏఆర్ అనురాధపై కోర్టు ధిక్కార కేసును అనుమతిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. సుమోటోగా హైకోర్టు ఈ కేసును స్వీకరించింది. జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు కేసును విచారించారు. ఈ కేసులో ఏఆర్ అనురాధ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కాగా రాష్ట్ర హోంశాఖ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజీవ్ త్రివేది కోర్టుకు హాజరయ్యేందుకు వీలుగా సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. సుప్రీం కోర్టు 2006లో సంస్కరణలపై జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకలేదని న్యాయమూర్తి తెలిపారు.