తెలంగాణ

సీతారామ ప్రాజెక్టుస్టేజ్-1కు అటవీ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ఖమ్మం జిల్లాలోని సీతారామా ఎత్తిపోతల సేజ్-1కు శుక్రవారం అటవీ అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 1531 హెక్టార్ల (3781 ఎకరాలు) అటవీ భూమి సేకరణకు కేంద్ర అటవీశాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం శుక్రవారం అనుమతి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయనున్నట్టు అటవీ, పర్యావరణ సాధికార కమిటీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా సాదారిక కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు నీటిపారుదలశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 1201 హెక్టార్లు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్‌లోని 330 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదలశాఖకు బదలాయించడానికి అటవీ, పర్యావరణ సాధికారిక కమిటీ సానుకూలత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. సీతారామా ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతి లభించడం పట్ల నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం ప్రకటించారు. స్టేజ్-1కు అటవీ అనుమతులు లభించడంతో స్టేజ్-2 అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే ఎకో సెన్సిటివ్ జోన్‌లోని 275 హెక్టార్లను కూడా బదలాయించాలని కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేసినట్టు మంత్రి వివరించారు. ఆరు లక్షల 74 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో సీతారామా ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 3లక్షల 45 వేల 534 ఎకరాల ఆయకట్టు స్థీరీకరణ జరుగుతుందని మంత్రి వివరించారు.