తెలంగాణ

హైదరాబాద్‌లోనే ఆర్‌ఎన్‌ఐ కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్‌గా , సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తెలంగాణ ప్రాంత అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఇ మారియప్పన్ శుక్రవారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరువనంతపురం పత్రికా కార్యాలయం అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న మారియప్పన్ బదిలీపై హైదరాబాద్ వచ్చారు. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రీజనల్ అవుట్‌రీచ్ బ్యూరోకు అధిపతిగానూ పనిచేశారు. క్షేత్ర ప్రచార విభాగం, దృశ్య, ప్రకటనల విభాగం, గేయ నాటక విభాగాలను కలిపి అవుట్‌రీచ్ బ్యూరోగా కేంద్రం మార్చింది. హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియాగా కూడా పనిచేస్తుందని అన్నారు. పత్రికల సర్క్యులేషన్ వెరిఫికేషన్ హైదరాబాద్ కార్యాలయం చేపడుతుందని, ఇక నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని మారియప్పన్ చెప్పారు. న్యూస్ ప్రింట్‌కు కావల్సిన వారు సెల్ఫ్ డిక్లరేషన్ దరఖాస్తును ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అదే విధంగా డిఎవిపి రెగ్యులారిటీ దరఖాస్తులు కూడా హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయంలో ప్రతి నెలా 15వ తేదీలోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు.