తెలంగాణ

ఆశావహుల్లో ‘కొత్త’ ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 19: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు కొట్టేసుకున్న వారిలో ‘కొత్త’ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. కొత్త అసెంబ్లీ సీట్లు ఆశిస్తున్న వారంతా ప్రత్యామ్నాయ పదవుల కోసం ఆలోచిస్తున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా డీలిమిటేషన్‌పై దృష్టి సారించినట్లు వార్తలు గుప్పుమంటుండగా, ఆశావహుల్లో ఆనందోత్సాహాలు రేకెత్తుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఫైలు బూజు ను ఎట్టకేలకు కేంద్ర హోంశా ఖ దులుపుతున్నట్లు వార్తలు వెలువడుతుండగా, సీట్లపెంపుకు సంబంధించి నోట్ కూడా సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటుండం గమనార్హం. అసెంబ్లీ సెగ్మెంట్ల పెంపు బిల్లుకు అమోదం లభిస్తే ఉమ్మడి జిల్లాలో రెండు నుంచి మూడు సీట్లు పెరిగే అవకాశాలుంటాయని, ఇందు లో ఒకటి ఎస్సీ రిజర్వేషన్‌గా మారే సూచనలున్నట్లు తెలుస్తోంది. తాజా వార్తలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఊరట కలుగగా, ఆశావాహుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో మూడు పార్లమెంట్, 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాత కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండగా, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మరో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. ప్రతీ పార్లమెంట్ పరిధిలో అదనంగా రెండు సీట్లు పెరుగుతాయన్న ప్రచారం మాత్రం జరుగుతున్నా, ఉమ్మడి జిల్లాలో రెండు నుంచి మూడు సీట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన సంగతి తెలిసిందే. విభజనతో ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రెండు నుంచి మూడు జిల్లాలకు విస్తరించింది. అయితే, సీట్ల పెంపు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోగా, ఇటీవలీ కాలంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్న తరుణంలో సీట్ల పెంపుదలపై దృష్టి సారించి కసరత్తు చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. జిల్లాల విభజన జరిగిన దరిమిలా సీట్ల పెంపును ఏ ప్రాతిపదికన తీసుకుంటుందో తెలియనప్పటికీ సీట్ల పెంపు శుభ సూచకంగా అధికార టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. సీట్లు పెరుగుతాయనే విశ్వాసంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, మంచి పేరున్న నాయకులను ఇప్పటికే టిఆర్‌ఎస్‌లో చేర్చుకోగా, కేంద్రం అనుసరించిన వ్యూహంతో రాష్ట్రంలోని అధికార పార్టీ నేతల్లో డైలామా నెలకొంది. అయితే, సీట్ల పెంపుపై ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. మొత్తానికి తాజా నిర్ణయంతో టికెట్టే లక్ష్యంగా ఆపార్టీలో చేర్చుకున్న, చేరిన వారికి ఇక ఢోకా లేదనే చర్చ మొదలు కాగా, మరోమారు ‘కొత్త’ ఆశలు ఆశావహుల్లో చిగురిస్తున్నాయి.