తెలంగాణ

మార్చి 15 నాటికి అన్ని గ్రామాలకు తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు 2018 మార్చి 15 వరకు తాగునీటి సరఫరా జరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ ఆదేశించారు. సూర్యాపేట, ఆదిలాబాద్ సెగ్మెంట్‌ల్లో నడుస్తున్న మిషన్ భగీరథ పనులను శనివారం సమీక్షించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు 49,184 కిలోమీటర్ల పైప్‌లైన్లు వేయాల్సి ఉండగా, 44,323 కిలోమీటర్ల పైప్‌లైన్లు వేశామని గుర్తు చేశారు. మిగిలిన పైప్‌లైన్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సింగ్ కోరారు. ఈ సమావేశంలో ఇఎన్‌సి సురేందర్‌రెడ్డితో పాటు చీఫ్ ఇంజనీర్లు, కొన్ని ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.