తెలంగాణ

సైన్స్ ఇంజనీరింగ్ పట్ట్భద్రుల్లో భారతీయులదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: సైన్స్ ఇంజనీరింగ్ పట్ట్భద్రులను తయారుచేయడంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వార్షిక సైన్స్ ఇంజనీరింగ్ సూచికలు పేరుతో అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వెల్లడించిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2014లో సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రపంచ వ్యాప్తంగా బ్యాచిలర్ పట్టాలు పొందిన వారిలో, నాలుగింట ఒక వంతు మంది భారతీయులేనని పేర్కొంది. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మంది సైన్స్ , ఇంజనీరింగ్‌ల్లో బ్యాచిలర్ కోర్సులు పూర్తి చేశారని, వారిలో భారతీయులు 25 శాతం, చైనీయులు 22 శాతం, ఐరోపా సమాఖ్య వారు 12 శాతం, అమెరికన్లు 10 శాతం ఉన్నారని వెల్లడించింది. పరిశోధక డిగ్రీల్లో మాత్రం అమెరికా ముందంజలో ఉంది. 2014లో ఆ దేశంలో 40వేల మంది పట్టాలు అందుకున్నారు. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా 34వేలు, రష్యా 15వేలు, బ్రిటన్ 14వేలు, భారత్ 13వేల మంది ఉన్నారు. ఇటు పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన వ్యయం చేడంలోనూ అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యయంలో 26 శాతం వాటా అమెరికన్లదే. 21 శాతం వాటాతో చైనా రెండోస్థానంలో ఉంది, మిగతా దేశాలు ముఖ్యంగా చైనా గణనీయమైన ప్రగతిని సాధిస్తుండటంతో శాస్త్ర సాంకేతిక కార్యకలాపాల్లో అమెరికా వాటా తగ్గిపోతోందని ఆ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ అవగాహన ఒప్పందాల్లో యుకె 57 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఫ్రాన్స్ 55 శాతం, జర్మనీ 51 శాతం, యుఎస్ 37 శాతం మేర అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలతో ముందంజలో ఉన్నాయి. సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాల నుండి వస్తున్న కీలక పరిశోధన ప్రచురణల విషయంలో 47 శాతం నుండి 56 శాతానికి పెరిగాయి.