తెలంగాణ

హైదరాబాద్‌లో ‘కస్టమ్స్ అకాడమి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్‌లో ప్రతిష్టాకరమైన నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదకద్రవ్యాల జోనల్ శిక్షణ సంస్థను రూ.47 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ కస్టమ్స్ చైర్మన్ వనజా ఎన్ శర్మ చెప్పారు. శనివారం ఇక్కడ ఆమె అత్తాపూర్‌లో ఈ సంస్థ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ భవనంలో అన్నివౌలిక సదుపాయాలు ఉంటాయని, పన్నులు చెల్లించే వారికి సౌలభ్యంగా అన్ని ఆధునిక ఏర్పాట్లు చేస్తామన్నారు. శిక్షణ, పరిపాలన, హాస్టల్, క్రీడలు, రిక్రియేషన్ సదుపాయాలకు భవనాలను వేరువేరుగా నిర్మిస్తామన్నారు. పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తామన్నారు. పదివేల మంది అధికారులకు ఇక్కడ శిక్షణ ఇస్తామన్నారు. పరోక్ష పన్నులు, జిఎస్‌టి, ఇతర విభాగాల్లో ఇక్కడ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమె హైదరాబాద్ ఏరియాలో కస్టమ్స్ శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, కస్టమ్స్ శాఖ డైరెక్టర్ జననరల్ అర్చన పి తివారీ, హైదరాబాద్ జోన్ జిఎస్‌టి చీఫ్ కమిషననర్ బి బి అగర్వాల్, సెంట్రల్ విభాగం జిఎస్‌టి చీఫ్ కమిషనర్ వై షార్వాత్, అదనపు డైరెక్టర్ జననరల్ జెఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.