జాతీయ వార్తలు

ఎమ్సెట్‌కు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ (వైద్య) నిర్వహణకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో వైద్య విద్య కోర్సులకు ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్-మెడికల్) నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టు ముందు జాతీయ వైద్య మండలి (ఎంసీఐ) చేసిన ప్రతిపాదనలు తెలుగు రాష్ట్రాలకు ఊరట కలిగించాయి. ప్రైవేటు కళాశాలలు, అసోసియేషన్లు, డీమ్డ్ వర్శీటీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీట్ పరీక్ష నిర్వహించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇదిలావుంటే, ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లను తామే భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేసు విచారించిన సుప్రీం ధర్మాసనానికి విన్నవించుకుంది. దీంతో, నీట్‌పై తుది తీర్పును వచ్చే సోమవారం వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను పునఃపరిశీలించాలని ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు, పలు విద్యాసంస్థలు దాఖలు చేసిన పిటీషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ శివకిర్తి సింగ్, జస్టిస్ ఎకె గోయల్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట తెలంగాణ, అసోం, జాతీయ వైద్య మండలి (ఎంసీఐ), సీబీఎస్‌ఇ, కేంద్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తన వాదన వినిపిస్తూ నీట్ నిర్వహణపై అన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు, ప్రతిపాదనలు వచ్చాయని వివరించారు. రాష్ట్రాలు లేవనేత్తిన అంశాలను శని, ఆదివారాల్లో ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారులతో చర్చించి తుది నిర్ణయాన్ని సోమవారం కోర్టుకు తెలుపుతామని వివరించారు. సిబిఎస్‌ఇ తరఫున న్యాయవాది పింకీ ఆనంద్ తన వాదన వినిపిస్తూ మొదటి దశలో నీట్ పరీక్ష రాసినవారు రెండో విడత పరీక్ష రాసే వీలుండదని వివరించారు. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ రావల్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో వందశాతం ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో మెడికల్ సీట్లను తామే భర్తీ చేస్తామని తెలిపారు. ఇదిలావుంటే, సుప్రీం కోర్టు ముందు జాతీయ వైద్య మండలి పలు ప్రతిపాదనలు చేసింది. మండలి తరఫున న్యాయవాది వికాస్ సింగ్ తన వాదన వినిపిస్తూ ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్-మెడికల్) రాష్ట్రాలే నిర్వహిచుకోవచ్చని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సుప్రీం ధర్మాసనం సైతం అంగీకారం తెలిపింది. ప్రైవేటు కళాశాలు, అసోసియేషన్, డీమ్డ్ వర్శిటీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీట్ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే రాష్ట్రాల అభ్యంతరాలు, ప్రతిప్రాదనలు నేపథ్యంలో రాష్ట్రాలు నిర్వహించే పరీక్ష (ఎంసెట్) ద్వారా ప్రయివేటు కళాశాలల్లో సీట్ల భర్తీకి సోమవారం ఒక స్పష్టతను సుప్రీంకోర్టు ఇవ్వనుంది. తదుపరి విచారణను సోమవారం మధ్యహ్నం 2గంటలకు వాయిదా వేసింది.
అగస్టాకు కొమ్ముకాశారు!